అన్నం కాకుండా.. షుగర్ ఉన్నవారు ఏమేమి తినొచ్చంటే?
అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగాగ ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు వైట్ రైస్ ను తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. మరి అన్నం కాకుండా డయాబెటీస్ పేషెంట్లు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
diabetes diet
షుగర్ ఉన్నవారు ఫడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర లెవెల్స్ ను బాగా పెంచుతాయి. డయాబెటీస్ ను నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు తినే ఫుడ్ విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి. వీటిలో మధుమేహం ఉన్నవారు అన్నం తినొచ్చా? అనే డౌట్ కూడా ఉంది.
నిజానికి అన్నంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందులోనూ అన్నంలో గ్లైసెమిక్ ఇంటెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను బాగా పెంచుతుంది. అయితే డయాబెటీస్ పేషెంట్లు అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ అన్నాన్ని ఎక్కువ మొత్తంలో మాత్రం తినకూడదు. అన్నంలో నెయ్యి వేడయం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు అన్నం కాకుండా.. వేరే ఏ ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఓట్స్: డయాబెటీస్ ఉన్నవారికి ఓట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహులు మధ్యాహ్నం అన్నానికి బదులుగా ఓట్స్ ను తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది.
బార్లీ: బార్లీని కూడా షుగర్ ఉన్నవారు అన్నానికి బదులుగా తినొచ్చు. బార్లీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బార్లీ తీసుకోవడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. దీంతో మీరు తక్కువగా తిని ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. అంతేకాదు ఇది డయాబెటీస్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.
Image: Getty Images
బ్రౌన్ రైస్
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటీస్ పేషెంట్లు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ ను తినొచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రెడ్ రైస్ వైట్ రైస్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని ఎంచక్కా తినొచ్చు. ఇవి డయాబెటీస్ ను నియంత్రిస్తాయి.