గీజర్ అవసరమే లేదు.. ఇలా చేస్తే వాటర్ ట్యాంక్ లో నీళ్లు వేడిగా ఉంటాయి
చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. కాబట్టి గీజర్ ను చాలా మంది గీజర్ ను వాడుతుంటారు. కానీ దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అయితే గీజర్ అవసరం లేకుండా వాటర్ ట్యాంక్ నీళ్లు వేడి ఉంచే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటంటే?
చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. ఈ సీజన్ లో చల్ల నీళ్లతో స్నానం చేయడం చాలా కష్టం. ఇందుకోసం హీటర్లను, గీజర్లను వాడుతుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఈ గీజర్లు పనిచేయవు. అలాగే కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హీటర్లు, గీజర్లు అవసరం లేకుండానే ఇంట్లోని వాటర్ ట్యాంక్ నీటిని సహజంగా వేడిగా ఉంచొచ్చు. అవును ఒక్క ఎండాకాలంలోనే కాదు.. చలికాలంలో కూడా సహజంగా వేడెక్కేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
థర్మోకోల్
థర్మకోల్ తో నేచురల్ గా నీళ్లు వేడెక్కేలా చేయొచ్చు. ఇది మంచి ఇన్సులేటర్‌గా పనిచేస్తుంది.ఈ థర్మకోల్ బయటి ఉష్ణోగ్రత ట్యాంక్ లోపలికి వెల్లకుండా చేస్తుంది. వాటర్ ట్యాంక్ చుట్టూ థర్మోకోల్ ఉంటే చల్ల గాలి వల్ల ట్యాంక్‌లోని నీళ్లు చల్లబడవు.
ఇందుకోసం 5 మి.మీ. కంటే తక్కువ మందం ఉన్న థర్మోకోల్‌ను ట్యాంక్‌పై అతికించండి. కావాలనుకుంటే వాటర్ ట్యాంక్ మూతను కూడా థర్మోకోల్‌తో కప్పండి.
వాటర్ ట్యాంక్ లో నీళ్లు వేడిగా ఉండాలంటే వాటర్ ట్యాంక్ రంగు ముదురు రంగులో ఉండాలి. ఎందుకంటే ముదురు రంగులు వేడిని త్వరగా గ్రహిస్తాయి. దీనివల్ల ఎండలో ఉన్నప్పుడు ట్యాంక్‌లోని నీళ్లు త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి ట్యాంక్‌పై లేత రంగు పెయింట్ ఉంటే చలికాలంలో దానిని ముదురు రంగు వేయండి.
ఎండాకాలంలో నీళ్లు చల్లగా ఉండాలని నీడున్న ప్లేస్ లో వాటర్ ట్యాంక్ ను పెడతారు. కాబట్టి చలికాలంలో నీళ్లు వేడిగా ఉండటానికి మీరు వాటర్ ట్యాంక్ ను ఎండలో పెట్టండి. ఇది నీళ్లు నేచురల్ గా వేడెక్కేలా చేయొచ్చు.
నేచురల్ గా నీళ్లు వేడెక్కాలంటే చలికాలంలో నీటి ట్యాంక్‌ను గ్లాస్ ఫైబర్ లేదా రబ్బరు వంటి పదార్థాలతో కప్పాలి. ఇలా ట్యాంక్‌ను కప్పడం వల్ల వాతావరణం చల్లగా ఉన్నా నీళ్లు మాత్రం చల్లబడవు. రబ్బరు వంటి ఇన్సులేటర్లు బయటి ఉష్ణోగ్రతను లోపలికి రాకుండా చేస్తాయి.