ఐస్ క్యూబ్స్ ని ఇలా వాడొచ్చని ఎవరికీ తెలియకపోవచ్చు...!
డ్రింక్స్ లో వేసుకోవడమే కాదు.. ఐస్ క్యూబ్స్ ని చాలా రకాల కిచెన్ హ్యాక్స్ లో వాడొచ్చు. దాదాపు ఐస్ క్యూబ్స్ ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం....
ఐస్ క్యూబ్స్ తయారు చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. చాలా సింపుల్. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే చాలు ఎవరైనా చేసేస్తారు. కానీ.. ఆ ఐస్ క్యూబ్స్ ని కేవలం జ్యూస్ లో, కూల్ డ్రింక్స్ లో వేసుకొని తాగుతూ ఉంటాం. కానీ...డ్రింక్స్ లో వేసుకోవడమే కాదు.. ఐస్ క్యూబ్స్ ని చాలా రకాల కిచెన్ హ్యాక్స్ లో వాడొచ్చు. దాదాపు ఐస్ క్యూబ్స్ ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం....
1.ఫుడ్ ని కూల్ చేయడానికి...
ఒక్కోసారి మనం చాలా హడావిడిగా వంట చేస్తాం. తినడానికి కూడా సమయం ఉండదు. ఆ సమయంలోనే ఫుడ్ బాగా కాలుతూ ఉంటుంది. దానిని ఆరపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి సమస్యకు కూడా ఎదురైతే.. ఈ ఐస్ క్యూబ్స్ తో ఆహారాన్ని చల్లగా చేయవచ్చు. ఒక పెద్ద గిన్నె లో ఐస్ క్యూబ్స్ వేసి కొద్దిగా నీటితో నింపండి, ఇప్పుడు.. వేడిగా ఉన్న ఆహారం గిన్నెను ఆ ఐస్ క్యూబ్ బౌల్ లో ఉంచి.. రెండు, మూడు సార్లు కలపాలి. చాలా తక్కువ సమయంలోనే ఆహారం నార్మల్ ఉష్ణోగ్రతకు వచ్చేస్తుంది.
2.అదనపు ఫ్యాట్ తొలగించానికి...
ఒక్కోసారి మనకు తెలీకుండా కూరల్లో.. నూనె ఎక్కువగా వేస్తూ ఉంటాం. కూర మొత్తం అయిపోయిన తర్వాత.. అలా నూనె తేలుతూ కనపడుతుంది. అలాంటి నూనెను తొలగించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే.. ఐస్ క్యూబ్స్ వాడి.. దానిని తీసేయవచ్చు. ఆ నూనెలో ఐస్ క్యూబ్ ముంచిన ప్రతిసారీ.. అదనపు నూనె మొత్తం దానికి అంటుకొని వచ్చేస్తుంది. అదనపు ఫ్యాట్ తొలగించి.. మనం హ్యాపీగా ఫుడ్ తినవచ్చు.
3.సాస్ లను చల్లగా ఉంచడానికి..
పార్టీలు లేదా సమావేశాల సమయంలో, డిప్స్ , సాస్‌లను చల్లగా ఉంచడం ఒక సవాలుగా ఉంటుంది. మీ డిప్లు సాస్‌ల చిన్న గిన్నెలను ఉంచడానికి ఐస్ క్యూబ్స్ తో నిండిన గిన్నెను సృష్టించండి. ఇప్పుడు ఈ సాస్ లను ఐస్ క్యూబ్స్ ఉన్న గిన్నెలో ఉంచితే సరిపోతుంది. ఎక్కువ సేపు అవి చల్లగా ఉంటాయి.
4.కూరగాయలు, పండ్లు పీల్ చేయడానికి...
కొన్ని రకాల కూరగాయలు, పండ్లను మనం పీల్ చేసిన తర్వాత తినగలం. అయితే.. ఆ పీల్ తీయడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో... మీరు వాటిని కొంత సేపు... ఐస్ క్యూబ్స్ ఉంచిన బౌల్ లో ఉంచాలి. ఆ తర్వాత తీస్తే... చాలా ఈజీగా వచ్చేస్తాయి. పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది.
5.సీ ఫుడ్ ని స్టోర్ చేయడానికి..
తాజా చేపలు, సీఫుడ్ వండడానికి సిద్ధంగా ఉన్నంత వరకు చల్లగా ఉంచడం మంచిది. సరైన తాజాదనాన్ని నిర్వహించడానికి , చెడిపోకుండా నిరోధించడానికి రిఫ్రిజిరేటర్లోని ఐస్ బాక్స్ లో వాటిని నిల్వ చేయండి. ఇలా చేస్తే..ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
6.బ్లెండర్, మిక్సీ జారులను శుభ్రం చేయడానికి...
మనం బ్లెండర్, మక్సీ జారుల్లో చాలా పిండులను గ్రైండ్ చేస్తాం. అయితే.. ఎంత శుభ్రం చేసినా... అవి జారు బ్లేడుల్లో ఇరుక్కుంటాయి. అలాంటి సమయంలో... ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేస్తే.... బ్లేడులో ఇరక్కుపోయిన అవశేషాలు మొత్తం పోతాయి. జారు బ్లేడ్లు శుభ్రపడతాయి.