ఆగస్టులో లాంగ్ వీకెండ్... ట్రిప్ కి వెళ్లడానికి బెస్ట్ ప్లేసులు ఇవే..!
ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ వీకెండ్ ని ఎంజాయ్ చేయవచ్చు. మరి.. ట్రిప్ కి ఎలాంటి ప్లేసులకు వెళ్లాలి అని చూస్తున్నారా..? ఆ ప్లేసులేంటో ఇప్పుడు చూద్దాం...
పని ఒత్తిడి ని రిలీఫ్ పొందడానికి.. ఎక్కడికైనా మంచి ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే.. వచ్చేవారం అంటే.. ఆగస్టు లో లాంగ్ వీకెండ్ రాబోతుంది. ఉద్యోగాలు చేసేవారికి ఈ లాంగ్ వీకెండ్ ట్రిప్ కి వెళ్లడానికి బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. అంతేకాదు. పిల్లలకు కూడా వరసగా నాలుగైదు రోజులు సెలవలే. కాబట్టి... ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ వీకెండ్ ని ఎంజాయ్ చేయవచ్చు. మరి.. ట్రిప్ కి ఎలాంటి ప్లేసులకు వెళ్లాలి అని చూస్తున్నారా..? ఆ ప్లేసులేంటో ఇప్పుడు చూద్దాం...
1.బ్యాంకాక్, పట్టాయా, థాయిలాండ్..
చాలా మంది ట్రావెలర్స్ చూడాలి అనుకునే ప్లేసుల్లో బ్యాంకాక్ ముందు ఉంటుంది. బ్యాంకాక్ సంస్కృతి చాలా కొత్తగా ఉంటుంది. ఎవరికైనా నచ్చేస్తుంది. హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. పట్టాయాలో బీచ్ లు మరింత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నైట్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్ మన దేశానికి దగ్గరలోనే ఉంది. వెళ్లడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
2.బాలి, ఇండోనేషియా..
వీకెండ్ లో కచ్చితంగా రిలాక్స్ అవ్వాల్సిన మరో ప్రదేశం బాలి, ఇండోనేషియా. బాలీలో చాలా రకాల ఆకర్షణీయమైన బీచ్ లు, పురాతన దేవాలయాలు, లష్ ల్యాండ్ స్కేప్ లు చాలా ఉన్నాయి. అక్కడ నైట్ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది. లాంగ్ వీకెండ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
3.వియత్నాం..
ప్రయాణికులు బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వియత్నాం వెళ్లాల్సిందే. వియత్నాంలోని హనోయి లో చారిత్రాత్మకంగా ఆకర్షించే ప్రదేశాలు చాలా లఉన్నాయి. హా లాంగ్ బే మరింత అందంగా ుంటుంది. ముందే ప్లాన్ చేసుకుంటే.. తక్కువ బడ్జెట్ లో ప్యాకేజీలు సెలక్ట్ చేసుకోవచ్చు.
Malaysia Twin Towers
మలేషియా..
మలేషియా ని కూడా ఈ లాంగ్ వీకెండ్ మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు. కౌలాలంపూర్ లోని ఐకానిక్ స్కైలైన్, లంకావి లోని బీచ్ లు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. బీచ్ సైడ్ ఉండే సిటీ చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు.
Singapore
సింగపూర్..
"సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ , గార్డెన్స్ బై ది బే వంటి ప్రముఖ ఆకర్షణలు లాంగ్ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయవచ్చు . ఇక్కడ షాపింగ్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ముందే.. టికెట్లు బుక్ చేసుకుంటే.. టికెట్ ధరలు బడ్జెట్ లో వచ్చే అవకాశం ఉంది.
Srilanka
కొలంబో, శ్రీలంక..
కొలంబో ః సాంస్కృతిక గొప్పతనాన్ని, గాలే చారిత్రాత్మక శోభను ఆస్వాదించడానికి శ్రీలంక వెళ్లాల్సిందే. సుందరమైన రైలు సవారీలు, అందమైన దక్షిణ బీచ్‌లు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.