ఈ ఒక్క డ్రింక్ తాగితే.. బెల్లీ ఫ్యాట్ కరగడం పక్కా..!
ఇప్పటికి చాలా ట్రై చేశాం కానీ రిజల్ట్ రాలేదు అనుకునేవాళ్లు కూడా.. ఒక్కసారి.. ఇప్పుడు చెప్పబోయే రెమిడీ ప్రయత్నించి చూడండి. ఎంత మొండి బెల్లీ ఫ్యాట్ అయినా కరిగిపోవాల్సిందే. మరి ఆ రెమిడీ ఏంటో.. అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం....
belly fat
ఈరోజుల్లో నిజం చెప్పాలంటే శారీరక శ్రమ తగ్గిపోయిందనే చెప్పాలి. ఎక్కువగా కుర్చీల్లో గంటలతరపడి కూర్చొని చేసే పనులే ఉంటున్నాయి. శారీరక శ్రమ చేసి, చెమటలు చిందించే పనులు తక్కువ. ఈ కూర్చొని చేసే పనుల్లో ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ.. మెంటల్ స్ట్రెయిన్ మాత్రం చాలా ఎక్కువ. ఈ క్రమంలో ఒత్తిడి పెరుగుతుంది.. ఈ ఒత్తిడి ఏం తింటున్నామో, ఎంత తింటున్నాం అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోం. ఫలితంగా.. నెత్తిమీద జుట్టు రాలిన రాలకున్నా.. పొట్ట మాత్రం ఈజీగా పెరిగిపోతుంది. విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు.. నడుము చుట్టూ కొవ్వు కూడా పేరుకుపోతుంది.
ఇక.. ఆ పెరిగిపోయిన బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజానికి ఇది కేవలం పురుషుల సమస్య మాత్రమే కాదు.. స్త్రీలలోనూ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోయి ఇబ్బందిపడుతూ ఉంటారు. చాలా మంది తాము ఎంత కష్టపడినా బరువు అయితే తగ్గుతున్నాం కానీ... బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగడం లేదు అని వాపోతూ ఉంటారు. ఇప్పటికి చాలా ట్రై చేశాం కానీ రిజల్ట్ రాలేదు అనుకునేవాళ్లు కూడా.. ఒక్కసారి.. ఇప్పుడు చెప్పబోయే రెమిడీ ప్రయత్నించి చూడండి. ఎంత మొండి బెల్లీ ఫ్యాట్ అయినా కరిగిపోవాల్సిందే. మరి ఆ రెమిడీ ఏంటో.. అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం....
కేవలం మన కిచెన్ లో రెగ్యులర్ గా లభించే మసాలా దినసులతో ఈ బెల్లీ ఫ్యాట్ కరిగించే డ్రింక్ తయారు చేయవచ్చు. దీనిని తయారు చేయడానికి మీకు కేవలం మంచినీళ్లు, అల్లం,నిమ్మకాయ, పసుసు , తులసి ఆకులు, నెయ్యి ఉంటే చాలు. వాటితో.. బెల్లీ ఫ్యాట్ డ్రింక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం...
పైన చెప్పిన ఈ పదార్థాలన్నీ ముందు.. బరువు తగ్గడానికీ అయినా, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి అయినా ఎలా హెల్ప్ అవుతాయో తెలుసుకుందాం..
అల్లం, తులసి, పసుపు అన్నీ..మన జీవక్రియను మెరుగుపరచడంలో సహాయం చేసేవే.ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడే పోషకాలతో నిండి ఉంటాయి.
belly fat
బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి అల్లం: అల్లంలో జింజెరాల్, యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. శరీరంలో థర్మోజెనిసిస్ (వేడి ఉత్పత్తి) పెంచుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, ఇది కొవ్వు ఆక్సీకరణకు సహాయపడుతుంది. ఆకలిని అణిచివేస్తుంది.
బరువు తగ్గడానికి నిమ్మకాయ: నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ , విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది . కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. దాని మూత్రవిసర్జన లక్షణాలు శరీరాన్ని నిర్విషీకరణ చేయడం ,జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి పసుపు: పసుపులో కర్కుమిన్, ప్యాంక్రియాటిక్ , కండరాల కణాలలో మంటను తగ్గించే యాంటీఆక్సిడెంట్, శరీర కొవ్వు , ఊబకాయాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి తులసి: తులసిలో యూజీనాల్ ఉంది, ఇది కీళ్ళు ,జీర్ణవ్యవస్థపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలతో కూడిన ముఖ్యమైన నూనె. ఇది తేలికపాటి మూత్రవిసర్జనగా కూడా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
బరువు తగ్గడానికి నెయ్యి: నెయ్యిలో కొవ్వు-కరిగే విటమిన్లు , ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కొవ్వు కణాలను తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.
belly fat
ఇప్పుడు వీటితో బెల్లీ ఫ్యాట్ డ్రింక్ ఎలా చేయాలి అంటే...
కొద్దిగా అల్లం తురుము, నిమ్మకాయ ముక్కలు, పసుపు పొడి లేదా పేస్ట్, తులసి ఆకులు, ఒక చెంచా నెయ్యి ఒక జగ్ నీటిలో జోడించండి. దీనిని మొత్తాన్ని మరిగించాలి. వడపోసుకొని కాస్త వేడి తగ్గిన తర్వాత.. గోరువెచ్చగా ఆస్వాదిస్తే సరిపోతుంది. వరసగా నెల రోజులు తాగిచూస్తే.. రిజల్ట్ మీకే క్లియర్ గా తెలుస్తుంది.