- Home
- Life
- Health Tips: 50 ఏండ్ల తర్వాత కూడా ఎలాంటి రోగాలు సోకకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మార్పులు అవసరం..
Health Tips: 50 ఏండ్ల తర్వాత కూడా ఎలాంటి రోగాలు సోకకుండా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మార్పులు అవసరం..
Health Tips: ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వయసు మీద పడుతున్న కొద్దీ ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది. కొన్ని ప్రమాదకరమైన రోగాల వల్ల లైఫ్ సగంలోనే ముగిసిపోవచ్చు. అయితే కొన్ని చిట్కాలను 50 లో కూడా మీరు ఎంతో ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు లేకుండా జీవిస్తారు.

Health Tips: ఒక వ్యక్తికి యాభై ఏండ్లు నిండితే చాలు.. అతని అనేక దీర్ఘకాలిక వ్యాధులతో పాటుగా మరెన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అయినా ఈ మారిన జీవన శైలిలో ఎంతో మంది చిన్నవయసులోనే ప్రమాదకరమైన జబ్బులను ఎదుర్కొంటున్నారు.
ఈ సంగతిపక్కన పెడితే.. యాభై ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలని కోరకుంటారు. ఇది బాగానే ఉన్నా.. ఈ వయసు వారి చుట్టు ఎన్నో రోగాలు చుట్టుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే దీర్ఘాయుష్షుతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకతీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ రోజు వారి ఆహారంలో గింజలు, చిక్కుళ్లు, తృణధాన్యాలను చేర్చాలి. ఈ ఆహారాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
రెడ్ మీట్ కు దూరంగా ఉండండి.. రెడ్ మీట్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ 50 ఏండ్ల పైబడి ఉన్నవారికి ఇది ఏ మాత్రం మంచిది కాదు. రెడ్ మీట్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్, అనారోగ్యకరమైన కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె జబ్బు ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాహారం లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకండి.
ఎండలో కూర్చోవడం మర్చిపోకూడదు.. రోజంతా ల్యాప్ టాప్, ఫోన్ల వెలుగుల్లో ఉండటం కంటే ఉదయం పూట కాసేపు ఎండలో కూర్చుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. దీంతో ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి. ఎక్కువ సేపు ఎండలో కూర్చోవడం వల్ల ఎముకల వ్యాధికి దూరంగా కూడా ఉండొచ్చు.
శారీరక శ్రమ చాలా అవసరం.. శరీరక శ్రమ లేకపోవడం వల్ల మీరు స్థూలకాయం బారిన పడటమే కాదు ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. అంతేకాదు మీ శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరగదు. ఒక నివేదిక ప్రకారం.. దీర్ఘాయుష్షు పొందాలంటే ప్రతిరోజూ పదివేల అడుగులు నడవాలట. యాభై ఏండ్ల పై బడిన అంతకు తక్కువున్న ఎవ్వరైనా సరే రోజుకు పదివేల అడుగులు నడిస్తే.. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు.
ఒత్తిడికి గుడ్ బై చెప్పండి.. ఒత్తిడి మీ జీవితంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి వల్ల మీ జీవితం రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పని ఒత్తిడి, కుటుంబం, ఆర్థిక ఇబ్బుందు, నిరుద్యోగం వంటి వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురికాకండి. దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం ప్రతి రోజూ ధ్యానం చేయండి. దాంతో మీ మనస్సుకు ప్రశాంతంగా మారుతుంది.