Body checkup: ప్రతి ఏడాదికోసారి ఈ ఆరోగ్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి.. ఎందుకంటే..?
Body checkup: కొన్ని వ్యాధులు సోకకూడదంటే అప్పుడప్పుడు ఖచ్చితంగా బాడీ చెకప్స్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏడాదికోసారి షుగర్ చెక్, హిమోగ్లోబిన్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.

చెడు ఆహారపు అలవాట్లు , మారుతున్న జీవన శైలి కారణం ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఏ రోగమైనా ముందే చెప్పి రాదు కాబట్టి ఏడాదికోసారి వైద్య పరీక్షలు తప్పక చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పరీక్షలు 30 ఏండ్లు దాటిని ఆడవారు, మగవారు తప్పనిసరిగా చేయించుకోవాలి. అవేంటో ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
షుగర్ టెస్ట్.. 30 ఏండ్లు దాటిన పురుషులు, స్త్రీలు తప్పనిసరిగా ఏడాదికోసారి షుగర్ టెస్ట్ ను చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయినా ప్రస్తుత కాలంలో షుగర్ పెరగడం కామన్ విషయమైపోయింది కూడా. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బ్లడ్ షుగర్ టెస్ట్ ను తప్పనిసరిగా చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హిమోగ్లోబిన్ టెస్ట్.. ప్రతి ఏడాదికోసారి హిమోగ్లోబిన్ టెస్ట్ ను చేయించుకోవడం చాలా ముఖ్యం. ఈ టెస్ట్ ను సంపూర్ణ రక్త పరీక్ష అని కూడ అంటారు. ఇది ఒక సాధారణమైన రక్త పరీక్ష అయినప్పటికీ.. ఈ టెస్ట్ ద్వారా మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ లోపిస్తే మీలో హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్టు. అందుకే ఈ పరీక్షను కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి.
కొలెస్ట్రాల్ చెక్ .. లిపిడ్ టెస్ట్ ద్వారా కొలెస్ట్రాల్ ను చెక్ చేయొచ్చు. నిజానికి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి హాని జరగదు కానీ.. చెడు కొలెస్ట్రాల్ తోనే అసలు సమస్య వస్తుంది. ఇది బాడీలో పురుకుపోతే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ కూడా తప్పనిసరి.
థైరాయిడ్ టెస్ట్.. ప్రతి ఏడాదికోసారి మరువకుండా థైరాయిడ్ టెస్ట్ ను చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ థైరాయిడ్ సమస్య ప్రస్తుత కాలంలో సైలెంట్ కిల్లర్ లా విస్తరిస్తోంది. ఈ వ్యాధి తెలియకుండానే సోకి ఎన్నో సమస్యల బారిన పడేస్తుంది. అందుకే దీనిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.