Recipes: వర్షాకాలంలో వేడి వేడి స్నాక్స్.. తక్కువ సమయంలో ఎక్కువ రుచులు?
Recipes: వర్షాకాలం ప్రారంభమైంది. వేసవి తాపం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మనకి వర్షంలో మంచి స్నాక్స్ తినాలనిపించడం సహజం. కాబట్టి తక్కువ టైంలో చేసుకునే రకరకాల స్నాక్స్ ఏంటో చూద్దాం.

చిరుజల్లులని ఆనందించడం అందరికీ ఆహ్లాదమే. అలాంటి సమయంలోనే వేడి వేడి స్నాక్స్ తినాలనిపించడం కూడా సహజమే. అలా అని వంటగదిలోనే ఉండిపోతే వర్షపు జల్లుని ఆస్వాదించలేం అందుకే తక్కువ సమయంలో చేసుకునే కొన్ని స్నాక్స్ చూద్దాం. మొదటిది బ్రెడ్ పకోడీ..
ఇది చేయడం చాలా సులభం ఇంట్లో ఉండే బంగాళదుంప ఉడికించి ముద్ద చేసుకుని దానిలో కొంచెం ఉప్పు పసుపు జీలకర్ర కలిపి కాస్త ఫ్రై చేసి బ్రెడ్ మధ్యలో పెట్టి శనగపిండిలో డిప్ చేసి ఫ్రై చేస్తే వేడి వేడి పకోడీ రెడీ. అలాగే మరో రకం స్నేక్ ఉల్లిపాయ రింగ్స్. ఉల్లిపాయలు నిత్యం మన ఇంట్లో..
ఉంటాయి కాబట్టి సులభంగానే చేసుకోవచ్చు దీనికి కావలసింది బేకింగ్ సోడా ఉప్పు మరియు అదనపు రుచి కోసం కొన్ని మసాలా దినుసులు. ఇవన్నీ సరైన పాళ్ళల్లో కలిపి అందులో ఉల్లిపాయని నూనెలో ఫ్రై చేయడమే దీనిని చీజ్ డిప్ తో కానీ మింట్ చట్నీతో కానీ జత చేస్తే రుచి అమోఘం.
అలాగే బేల్ పూరీలు కూడా నిమిషాలలో తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా కాస్త మరమరాలు ఉల్లిపాయ తరుగు, టమోటా తరుగు, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం పల్లీలు అన్ని కలిపి సాస్ తో సర్వ్ చేస్తే సూపర్ బేల్ పూరి రెడీ.
ముంబైలో ఎక్కువగా ఉపయోగించే వడపావు కూడా చాలా త్వరగానే చేసుకోవచ్చు దీనికి కావలసిందల్లా బంగాళదుంపలు, వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి, పసుపు,శెనగపిండి, పావ్, కరివేపాకు, వెన్న..
వీటన్నింటితోని కలిపి వడపావ్ చేసుకొని పచ్చిమిర్చి పచ్చడితో తీసుకుంటే చల్ల చల్లని వర్షానికి ఘాటైన స్నాక్ భలే టేస్టీగా ఉంటుంది. అలాగే చీజ్ బచ్చలి కూర సమోసా కూడా వర్ష కాలానికి అనువైన స్నాక్. మరెందుకు ఆలస్యం పదండి వంటగదిలోకి.