ఆపిల్ సైడర్ వెనిగర్‌తో జుట్టుకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా...
ఓ విచిత్రమైన ట్రెండ్ ఒకటి ఇప్పుడు టిక్ టాక్ ను ఊపేస్తుంది. అదేంటంటే...ఆపిల్ సైడర్ వెనిగర్‌తో జుట్టును కడుక్కోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ గా మారిపోయింది.
బ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ఇందులో ముఖ్యంగా జుట్టు సంరక్షణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. జుట్టు రాలిపోవడం, బట్టతల, తెల్లజుట్టు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఎదుర్కునే సమస్యే.
దీనికోసం అనేక రకాల ప్రోడక్ట్స్, షాంపూలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు జుట్టుకు ఈ హెయిర్ మాస్క్ వేస్తే ఒత్తుగా పెరుగుతుంది. ఆ ఆయిల్ రాస్తే రాలిపోదు. ఈ చిట్కా పాటిస్తే తెల్లబడదు అంటూ ఎన్నో రకాల సమాచారం ఇంటర్నెట్ నిండా దర్శనమిస్తుంది.
ఇలాంటిదే ఓ విచిత్రమైన ట్రెండ్ ఒకటి ఇప్పుడు టిక్ టాక్ ను ఊపేస్తుంది. అదేంటంటే...ఆపిల్ సైడర్ వెనిగర్‌తో జుట్టును కడుక్కోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ గా మారిపోయింది. ఈ ట్రెండ్‌ను మీరూ ఫాలో అవ్వాలనుకుంటే.. దానికంటే ముందు ఇది నిజంగా ప్రయత్నించడానికి కరెక్టేనా, కాదా తెలుసుకోవడం ముఖ్యం.
apple cider vinegar జుట్టును డిఫ్రైజ్ చేయడంలో సహాయపడుతుందట, జుట్టును శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నవారు.
ఇదెలా జరుగుతుంది?
కొంతమంది అంతర్జాతీయ ప్రొఫెషనల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV) షాంపూకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీ జుట్టు నుండి రంగును తొలగించకుండా జుట్టు లేదా తలపై అంటుకున్న దుమ్ము, ధూళిని తొలగించడం ద్వారా మీ జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది.
hair
ACV rinsing ప్రయోజనాలు
ఆపిల్ సైడర్ వెనిగర్ hair care కోసం ఒక అద్భుతమైన పదార్ధంగా చెప్పబడింది. ఇందులో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి కలిగి ఉంటాయి. అంతేకాదు జుట్టును నిస్తేజంగా మారకుండా, పొడిబారకుండా కాపాడడంతో కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది అన్ని రకాల జుట్టుకూ బాగా పనిచేస్తుంది.
కాస్త జాగ్రత్త
అయితే, నేరుగా మీ జుట్టును శుభ్రం చేయడానికి స్వచ్ఛమైన ఆపిల్ సైడర్ వెనిగర్‌ని ఉపయోగించే ముందు, జాగ్రత్తగా ఉండాలి. హోమ్ ACV అనేది astringent, దీన్ని ఒక్కదాన్నే జుట్టుకు వాడినప్పుడు అది జుట్టు మీద కఠిన ప్రభావాన్ని చూపిస్తుంది.
అందుకే దీన్ని జుట్టుకు నేరుగా రాయడానికి ముందు దీన్ని నాచురల్ ఇంగ్రీడియంట్స్ తో కండీషనింగ్ చేస్తే ఆపిల్ సైడర్ వెనిగర్ లోని సుగుణాలన్నీ మీ జుట్టుకు లభిస్తాయి. దీంతో జుట్టు మృదువుగా మారుతుంది. ఇలాంటి కొన్ని ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. లేదా ఆన్లైన్లో లేదా స్టోర్లలో కూడా దొరుకుతున్నాయి.
మీరు హోమ్ ACVని ఉపయోగించాలనుకుంటే, కనీసం 4 కప్పుల నీటితో 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. అయితే ఇందులో sulfates ఉండకపోవడం వల్ల నురుగు రాదని గుర్తుపెట్టుకోవాలి.
ఎంత అయితే ఎక్కువ
ఆపిల్ సైడర్ వెనిగర్ జుట్టును శుభ్రంగా చేస్తుంది. ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందుకే జుట్టుకు వాడడం మంచిది. నిజమే.. అయితే ఏదైనా ఎక్కువ అంత మంచిది కాదు. ఇది ఆపిల్ సైడర్ వెనిగర్ విసయంలోనూ వర్తిస్తుంది. ACV అనేది ప్రాథమికంగా ఒక క్లెన్సర్. దీన్ని మోతాదుగా వాడితే జుట్టులోని సహజ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. అదే ఎక్కువగా వాడినప్పుడు natural oils పోతాయి.