Stomach gas:ఈ తప్పుల వల్లే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది..
Stomach gas: ప్రస్తుత కాలంలో కడుపులో గ్యాస్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ ప్రాబ్లం మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్లే వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Stomach gas:ప్రస్తుత కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సర్వ సాధారణం అయ్యింది. కానీ ఈ సమస్య వల్ల ఆకలి పూర్తిగా మందగిస్తుంది. అంతేకాదు బలహీనంగా మారడం, కడుపులో మంట, తిమ్మరి, నొప్పి వంటి వంటి సమస్యలు కలుగుతాయి. అలాగే ఈ సమస్య మూలంగా భుజాలు, ఛాతీపై చెడు ప్రభావం పడుతుంది.
ఈ గ్యాస్ ప్రాబ్లం మనం తిన్నది సరిగ్గా జీర్ణం కానప్పుడు వస్తుంది. ఈ వాయువు పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. ఈ గ్యాస్ సమస్య వల్ల కడుపులో నొప్పి వస్తుంది.
గ్యాస్ సమస్య ఉన్నవారు బీన్స్, బ్రోకలి, ఫిజీ డ్రింక్స్, క్యాబేజీ వంటి పదార్థాలను అస్సలు తినకూడదు. వీటిని తింటే గ్యాస్ ప్రాబ్లం మరింత పెరుగుతుంది. గ్యాస్ సమస్యను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. క్యాన్సర్ కు సంకేతంగా కూడా కడుపు ఉబ్బరాన్ని చెప్తారు.
ఎలా తగ్గించుకోవాలి.. గ్యాస్ సమస్య ఉన్నవారు బీన్స్, ఫిజీ డ్రింక్స్ ను , బ్రోకలీ వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. వీటి వల్ల గ్యాస్ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది.
పాల ఉత్పత్తుల వల్ల కూడా గ్యాస్ మరింత పెరిగే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉంటేనే మంచిది.
వేయించిన ఆహారాలను పూర్తిగా తీసుకోవడం మానేయాలి. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు నీటిలో కొన్ని పుదీనా ఆకులు, కాస్త అల్లం ముక్కను కలుపుని తాగితే ఉపశమనం లభిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్, ఫెన్నెల్ వంటివి కూడా గ్యాస్ సమస్యకు చెక్ పెడతాయి.
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు హెర్బల్ టీ లేదా గోరు వెచ్చని నీళ్లు బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల యోగాసనాల ద్వారా కూడా గ్యాస్ ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం పొందవచ్చు.