ఆంధ్రాలో కూడా కశ్మీర్ ఉంది.. ఎక్కడో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ కశ్మీర్ ఉంది. మరి, ఆ కశ్మీర్ ఎక్కడ ఉందో..? మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.
కశ్మీర్ ఎంత అందంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పర్లేదు. చుట్టూ మంచుతో కప్పడి ఉండే కశ్మీర్ ని వెళ్లాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ.. అది బడ్జెట్ తో కూడుకున్న విషయం. కానీ..తక్కువ ఖర్చులో మనం ఆంధ్ర కశ్మీర్ చూసి రావచ్చు. మీరు చదివింది నిజమే. మన ఆంధ్రప్రదేశ్ లోనూ కశ్మీర్ ఉంది. అది మరేంటో కాదు.. లంబసింగి.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో ఉన్న లంబసింగిని "ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్" అని పిలుస్తారు. ఇక్కడ సాధారణ హిమపాతం ఉండదు. బదులుగా, ఈ చిన్న గ్రామం చలికాలంలో మంచుకు ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో, సాధారణంగా డిసెంబర్, జనవరి మధ్య, ఉష్ణోగ్రతలు 0°C లేదా అంతకంటే తక్కువకు పడిపోతాయి.
వాతావరణం బాగా చల్లగా ఉండటంతో.. భూమి మీద, చెట్లపైనా మంచు కప్పబడి ఉంటుంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కాశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో కనిపించే మృదువైన మంచు కాదు, ఈ మంచు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
పొగమంచు లంబసింగి
సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగి తరచుగా దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంటుంది. ఇది చల్లని మైక్రోక్లైమేట్ను సృష్టిస్తుంది, ఇక్కడికి వెళితే.. మనకు డైరెక్ట్ గా కశ్మీర్ చూసిన అనుభూతి కచ్చితంగా కలుగుతుంది.
ఆంధ్రాలో చల్లని గ్రామం
లంబసింగి లో నవంబర్ నుండి జనవరి వరకు, ఉష్ణోగ్రతలు సాధారణంగా 0 నుండి 5°C వరకు ఉంటాయి. ఇక రాత్రి అయితే.. మంచు పూర్తిగా గడ్డకడుతుంది. శీతాకాలం మాత్రమే కాదు.. మామూలుగా కూడా ఈ గ్రామం చల్లగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు 15, 25°C మధ్య ఉంటాయి.
దట్టమైన పొగమంచు, తేలికపాటి గాలితో కలిసి మరపురాని అనుభూతిని సృష్టిస్తుంది. చల్లగా ఉన్నా చాలుు అనుకుంటే.. వేసవి నెలల్లో కూడా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. ప్రత్యేకమైన, ప్రశాంతమైన విరామం కోరుకునే ప్రయాణికులకు లంబసింగి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.