వామ్మో.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడితే ఇలా అవుతుందా?
సోషల్ మీడియా ప్రభావం మనపైనే కాదు మన ఆరోగ్యంపై కూడా పడుతుందని నిపుణులు అంటున్నారు. అవును గంటల తరబడి దీనిలో మునిగిపోయే వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. సోషల్ మీడియాలో కాసేపైనా గడపకుండా ఉండలేని వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఏ పని కోసమైనా ఫోన్ చూసినప్పుడు చివరగా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం మొదలుపెడతారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. ఎవరు ఏం ఫోటో పెట్టారు. ఏం స్టేటస్ పెట్టారు? ఏం ట్రెండ్ అవుతోంది? ఇవేవి లేకపోతే కుక్కలు, పిల్లుల క్యూట్ వీడియోలను చూసేస్తుంటారు.
mobile
మనలో చాలా మంది రోజులో గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతుంటాం. నిజానికి సోషల్ మీడియాలో గంటల తరబడి గడపాల్సిన అంత అవసరమేమీ ఉండదు. దీనివల్ల మీ విలువైన సమయం వృథా మాత్రమే అవుతుంది. అంతేకాదు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో కూడా ఈ విషయం వెల్లడైంది.
అధ్యయనంలో ఏం కనుగొన్నారు?
జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలో మంట స్థాయి పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఈ అధ్యయనంలో.. సోషల్ మీడియా వాడకం, మంట, నిరాశ మధ్య సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ అధ్యయనం కోసం.. స్క్రీన్ టైం ఉపయోగించారు. ఈ అధ్యయనంలో సోషల్ మీడియాను ఎంతసేపు ఉపయోగిస్తున్నారో కనుగొన్నారు. ఈ అధ్యయనంలో సోషల్ మీడియా వాడకం మొత్తం ఒక సమయంలో మంట స్థాయితో సంబంధం కలిగి ఉండటమే కాకుండా ఐదు వారాల తర్వాత మంటను కూడా పెంచిందని కనుగొన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయాన్ని నియంత్రించడం, దాని నుంచి విరామం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ఈ అధ్యయనం ద్వారం అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడం ఎలా?
సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవడం చాలా కష్టం. ఫోమో ఉండటం వల్ల కలిగే భయాందోళనలు లేదా ఒంటరితనాన్ని అధిగమించడానికి సోషల్ మీడియాలో గంటలు నిమిషాల్లో ఎలా గడిచిపోతాయో తెలియకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఈ కారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా కష్టం. అయితే కొన్ని చిట్కాలతో సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవచ్చు. అవేంటంటే?
లక్ష్యాలను సెట్ చేయండి
మీరు ఏ వల్ల అయితే సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో మీ మనస్సులో స్పష్టంగా ఉండాలి. ఇలాంటి సమయంలో అన్ని సోషల్ మీడియా యాప్స్ ను అన్ ఇన్ స్టాల్ చేద్దామనుకుంటారు. చేసేస్తుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఇన్ స్టాల్ చేస్తుంటారు. అందుకే మీరు ఎందుకు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నారో మీరు నిర్ణయించడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు మళ్లీ సోషల్ మీడియాలో గంటల తరబడి గడపరు.
సమయాన్ని సెట్ చేయండి
అసలు సోషల్ మీడియా నుంచి మీరు ఎంత సేపు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే కొన్ని గంటలా లేదా కొన్ని రోజులా, వారాలా లేదా నెలలా. అందుకే మీరు ఎంతసేపు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో షెడ్యూల్ చేసుకోండి. దీన్నిబట్టి మీరు సోషల్ మీడియాను ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతుంది.
మీ ఫోన్ సెట్టింగ్ లను మార్చండి
ఫోన్ నుంచి టింగ్ మన్న శబ్దం రాగానే వెంటనే నోటిఫికేషన్లను చూడటం మొదలుపెడతాం. ఈ అలవాటును తొలగించడానికి సోషల్ మీడియా నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి లేదా నోటిఫికేషన్ల వల్ల సౌండ్ రాకుండా సెట్ చేయండి.