ఆయిల్ స్కిన్ ఉన్నవారు తినాల్సిన, తినకూడదని ఆహారాలు ఇవే..!
ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముందుగా చేయాల్సిన పని ముఖాన్ని నీళ్లతో తరచుగా కడుక్కోవడం. అంతేకాదు ఇలాంటి చర్మం ఉన్నవాళ్లు కొన్ని ఆహారాలను అసలే తినకూడదు.

Skin care
చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికే మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. ఇలాంటి చర్మం ఉన్నవాళ్లు ముఖాన్ని నీళ్లతో తరచుగా కడుగుతూ ఉండాలి. అప్పుడే ముఖం తాజాగా కనిపిస్తుంది. అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటివల్ల కూడా చర్మంపై ఆయిల్ మరింత ఉత్పత్తి అవుతుంది.
ఆయిల్ స్కిన్ ఉన్నవారు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహారాలు
నారింజ
విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ మీ చర్మ ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు నారింజ పండ్లను తినడం వల్ల మీ చర్మం అందంగా మెరిసిపోతుంది.
దోసకాయ
దోసకాయల్లో 95 శాతం నీరు ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవారు కీరదోసకాయ జ్యూస్ గా లేదా పచ్చిగానైనా ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి.
nuts
గింజలు
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే గింజలను జిడ్డు చర్మం ఉన్నవారు ప్రతిరోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.
అవోకాడో
అవోకాడోస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి జిడ్డు చర్మాన్ని తొలగించడానికి కూడా సహాయపడతాయి.
ఆయిల్ స్కిన్ కోసం నివారించాల్సిన కొన్ని ఆహారాలు
పాలు
పాలు, పాల ఉత్పత్తులు మీ చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది.
నూనెలో వేయించిన ఆహారాలు
నూనెలో వేయించిన, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చాలా రుచికరంగా ఉంటాయి. కానీ ఈ ఆహారాలను ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగించడమే కాదు.. చర్మంపై ఆయిల్ ఉత్పత్తిని పెంచుతాయి. అంతకాదు వీటివల్ల ఆయిలీ స్కిన్ ఉన్నవారికి మొటిమలు అవుతాయి.
జంక్ ఫుడ్
పాస్తా, జంక్ ఫుడ్, జ్యూస్ లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఇలాంటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.
ఉప్పు
ఉప్పును ఎక్కువగా ఉపయోగించడం కూడా జిడ్డు చర్మాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకండి.