జీవిత భాగస్వామితో రాత్రి పడకపైకి చేరి, నిద్రిస్తే.....
జీవిత భాగస్వామిని చుట్టుకుని పడుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జ్ఢాపకశక్తి పెరుగుతుందని, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలు పెరుగుతాయని జర్మనీలోని సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ సైకియాట్రీకి చెందిన డాక్టర్ హెన్నింగ్ జోహన్నెస్ డ్రీవ్స్ చెప్పారు.
జీవిత భాగస్వామితో పడకపై చేరి, పక్కన పడుకుంటే ప్రయోజనాలు చాలా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి రాత్రి పూట ఒకే పడకపై చేరాలని అధ్యయనం చెబుతోంది. దానివల్ల దీర్ఘంగా, ప్రశాంతంగా నిద్రపోతారని, జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి తోడ్పడుతుందని అధ్యయనం తెలిజేస్తోంది.
ఒంటరిగా నిద్రపోయినప్పటి కన్నా కలిసి పడుకున్నప్పుడు రాపిడ్ ఐ మూవ్ మెంట్ (ఆర్ఈఎం) తగ్గి ఎక్కువగా ప్రశాంతంగా నిద్రపోతారని తాజా అధ్యయనంలో తేలింది. ఆర్ఈఎం భావోద్వేగాలను నియంత్రిస్తుందని, జ్ఢాపకశక్తి పెరుగుతుందని, సామాజికంగా క్రియాశీలకంగా వ్యవహరించడానికి, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకోవడానికి తోడ్పడుతుంది.
జీవిత భాగస్వామిని చుట్టుకుని పడుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జ్ఢాపకశక్తి పెరుగుతుందని, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలు పెరుగుతాయని జర్మనీలోని సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ సైకియాట్రీకి చెందిన డాక్టర్ హెన్నింగ్ జోహన్నెస్ డ్రీవ్స్ చెప్పారు.
స్త్రీపురుషులు ఒంటరిగా పడుకున్నప్పుడు, భాగస్వామితో కలిసి పడుకున్నప్పుడు వారి పరిస్థితిని అధ్యయనం చేశామని, కలిసి పడుకున్న దంపతుల స్లీప్ అర్కిటెక్చర్ ను స్టడీ చేశామని డ్రీవ్స్ చెప్పారు. బ్రెయిన్ వేవ్స్ నుంచి రెస్పిరేషన్, కండరాల ఉద్రిక్తత, కదలిక, హృదయం పనిచేసే తీరు వంటివాటిని పరిశీలించినట్లు తెలిపారు .
దంపతులు కలిసి పడుకున్నప్పుడు నిద్రించే పద్ధతుల్లో సింక్రనైజ్ చేసుకుంటారని, నిద్రించే సమయంలో కదలికలో పరస్పరం డిస్టర్బ్ చేసుకున్నప్పటికీ అవి సానుకూల ఫలితాలు ఇస్తాయని అధ్యయనంలో తేలింది.
దంపతులు పక్కపక్కన పడుకున్నప్పుడు లింబ్ మూవ్ మెంట్ ఎక్కువగా ఉంటుందని, స్లీప్ ఆర్కిటెక్చర్ ను కదలికలు ఏ మాత్రం చిరాకు పెట్టవని డ్రీవ్స్ చెప్పారు.