- Home
- Life
- Sankranti 2023: మకర సంక్రాంతికి కిచిడీని ఎందుకు తింటారు? దీనివెనకున్న అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు..
Sankranti 2023: మకర సంక్రాంతికి కిచిడీని ఎందుకు తింటారు? దీనివెనకున్న అసలు కథ తెలిస్తే షాక్ అవుతారు..
Sankranti 2023: మకర సంక్రాంతికి కిచిడీని ఖచ్చితంగా చేస్తారు. దీన్ని ఇతరులకు కూడా దానం చేస్తారు. అసలు ఈ సంక్రాంతి నాడు కిచిడీని ఎందుకు తింటారో తెలుసా?

ఈ ఏడాది జనవరి 15 వ తేదీన అంటే ఈ రోజు మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. ఈ రోజునే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడని నమ్ముతారు. అయితే ఈ మకర సంక్రాంతిని కిచిడీ పండుగ అని కూడా అంటారు. యుపీ, బీహార్ ప్రజలు ఈ రోజున గంగానదిలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజిస్తారు. లేదా ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడిని మొక్కుతారు. ఆ తర్వాత చురా, పెరుగు, బెల్లం, నువ్వులు, కిచిడీ వంటి దార్థాలను దానంగా ఇస్తారు. ఆ తర్వాత ప్రజలు మొదట చురా పెరుగు, నువ్వులతో చేసిన ఆహారాలను తింటారు.
మకర సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కిచిడీని ఖచ్చితంగా తయారుచేస్తారు? అసలెందుకు కిచిడీనే తయారుచేస్తారన్న డౌట్ చాలా మందికే వచ్చి ఉంటుంది. దీని వెనుకున్న ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతికి కిచిడీని తినే సంప్రదాయం గురించి బాబా గోరఖ్ నాథ్ కు చెందిన ఒక ప్రసిద్ధ కథుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ భారతదేశంపై దండెత్తినప్పుడు.. ఆ సమయంలో అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకలేదట. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా నాథ్ యోగులకు ఆహారం వండడానికి తగిన సమయం దొరకలేదు. దాని వల్ల వారు రోజు రోజుకు బలహీనంగా మారుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన బాబా గోరఖ్ నాథ్ ఒక ట్రిక్ రూపొందించి అన్నం, పప్పులు, కూరగాయలు కలిపి వండమని సలహానిచ్చారు.
<p>khichdi food</p>
బాబా గోరఖ్ నాథ్ సలహా మేరకు నాథ్ యోగులు అన్నం, కూరగాయలు, పప్పులు మిక్స్ చేసి వంటను వండారని చెబుతారు. ఈ ఆహారం వారిని తిరిగి ఆరోగ్యంగా మార్చింది. బాబా గోరఖ్ నాథ్ ఈ వంటకానికి కిచిడీ అని పేరు పెట్టారు. ఖిల్జీతో యుద్ధం ముగిసిన తర్వాత మకర సంక్రాంతి రోజున ఉత్సవాలు నిర్వహించి ఆ రోజు ప్రజలకు కిచిడీని పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందని కొందరు చెప్తారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కిచిడీ గ్రహాలకు సంబంధించినదంటారు. బియ్యం చంద్రుడికి, మినప్పప్పు శనిదేవుడికి, పసుపు గురుదేవుడికి, ఆకుకూరలు బుధుడికి సంబంధించినవి కొందరు జ్యోతిష్యులు చెప్తారు. నెయ్యి సూర్యభగవానుడికి సంబంధించినది. అందుకే మకర సంక్రాంతి నాడు దీన్ని తినడం శుభప్రదంగా, ఆరోగ్యకరంగా భావిస్తారు.