సామ్ గ్లామర్ సీక్రెట్ ఈ గ్రీన్ స్మూతీనేనట.. ఎలా తయారు చేయాలంటే..
సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఏం మాయ చేశావే’ మూవీతో పరిచయమై.. అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతోంది. యేళ్లు గడుస్తున్నా అంతే ఎనర్జిటిక్ గా ఉంటుంది సమంతా.. మరి ఆ రహస్యమేంటో తెలుసా..
సమంతా తన రోజును గ్రీన్ స్మూతీతో ప్రారంభిస్తుంది. దీనివల్ల రోజంతా రెట్టించిన ఉత్సాహంతో ఉంటుందట. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉత్సాహానికి ఉత్సాహం అందిస్తుందట.
మరి దీన్నెలా తయారు చేస్తారు.. అంటే..ముందు ఈ గ్రీన్ స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూడండి..
గుప్పెడు పాలకూర
గుప్పెడు బచ్చలికూర
ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు
ఒక టేబుల్ స్పూన్ బాదంపప్పు పొడి
ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు
ఒక కప్పు కొబ్బరి నీళ్లు
ఒక అరటిపండు
పాలకూర, బచ్చలికూరను శుభ్రం చేసి.. బాగా కడగాలి. మీ ఇష్టాన్ని బట్టి వేరే ఆకుకూరలు కూడా కలుపుకోవచ్చు. ఆ తరువాత ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఈ ఆకుకూరలు వేసి కొద్దిసేపు నానబెట్టాలి.
ఇప్పుడు ఒక గ్లాసులో కొబ్బరినీళ్లు తీసుకుని అందులో పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు పొడి, చియా గింజలు వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు నాననివ్వాలి.
ఇప్పుడు ఒక మిక్సర్ తీసుకుని ఇందులో ఆకుకూరలు, అరటిపండు వేసి మిక్స్ చేయాలి. మెత్తటి పేస్టులా మారే వరకు బ్లెండ్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ముందుగా కొబ్బరినీళ్లలో నానబెట్టి పెట్టుకున్నపొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు పొడి, చియా గింజల మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు చేయాలి.
స్మూతీ తయారవ్వగానే ఒక గ్లాస్ లోకి పోసుకుని సర్వ్ చేయాలి. దీని మీద మీరు ఐస్ క్రష్ చేసి వేసుకుని కూడా తాగొచ్చు.
ఈ స్మూతీ బ్లెండ్ అయ్యేప్పుడు మీకు కావాలంటే ఒక స్పూన్ ప్రొటీన్ పౌడర్ కానీ, కొల్లాజిన్ పౌడర్ కానీ కలుపుకోవచ్చు.. ఇది సమంతా చెబుతున్న టిప్.