ఆధ్యాత్మిక గురు సద్గురు.. బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటారో తెలుసా?
ఆయన అసలు ఉదయం పూట అల్పాహారంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఓసారి మనం కూడా తెలుసుకుందాం.
Sadhguru
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలియని వారు ఎవరూ ఉండరేమో. ఆయన ఆశ్రమానికి వెళ్లి చాలా మంది సెలబ్రెటీలు వెళ్లి సేదతీరుతూ ఉంటారు. ఆయన చెప్పే మంచి మాటలు వినడానికి అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే, మీకు తెలుసా సద్గురు రోజులో కేవలం ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఆయన చాలా సంవత్సరాలుగా దీనిని ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Sadhguru
అయితే, ఆయన అసలు ఉదయం పూట అల్పాహారంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఓసారి మనం కూడా తెలుసుకుందాం. ఎవరూ తినలేని భిన్నమైన ఆహారాన్ని ఆయన తీసుకుంటూ ఉంటారు.
1.సద్గురు తన బ్రేక్ ఫాస్ట్ రొటీన్ లో మొలకలు తీసుకుంటారు. ఇది చాలా మంది చేసేదే కదా అని అనుకోకండి. ఆయన మొలకలుగా పెసళ్లు, కందులు కాకుండా, మెంతుల మొలకలు తీసుకుంటారు. వాటిని ఆయన చక్కగా నమిలి మింగుతుంటారట. వీటిని తినడం వల్ల ఇంటర్నల్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా, షుగర్ లెవల్స్ ని ఎప్పటి కప్పుడు బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది.
2.ఇవి కాకుండా, ఆయన నానపెట్టిన వేరుశెనగలు తింటారు. అది కూడా 6 నుంచి 8గంటలు నానపెట్టిన వేరు శెనగలను మాత్రమే తింటారు. ఇలా నానపెట్టుకొని తినడం వల్ల దానిలోని ఫైబర్ శరీరానికి అందుతుంది. దాని వల్ల డైజెషన్ చాలా మంచిగా జరుగుతుంది. బ్లడ్ సర్కిలేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. గుండెను పదిలంగా ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలు తొందరగా దరి చేరుకుండా ఉంటాయి.
3.వేపాకు బాల్స్... వేపాకు కొంచెం నోట్లో పెట్టుకోవడమే మన వళ్ల కాదు. అలాంటిది , ఆయన ఏకంగా వేపాకు పేస్ట్ తో చేసిన ఉండలు తింటారు. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడుతుందట. బ్లడ్ షుగర్ లెవల్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
Image: Getty
4.పసుపు ... పసుపు ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. దానిని కూడా ఆయన ఆహారంగా తీసుకుంటారు. గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని పరగడుపున దానిని ఆయన తీసుకుంటారట. ఇలా తీసుకోవడం వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. శరీరం డీటాక్సిన్ అవ్వడానికి సహాయపడుతుంది. లివర్ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
soaked badam
5.నానపెట్టిన బాదం..
రాత్రిపూట నానపెట్టిన బాదం పప్పు పొట్టు తీసేసి, ఉదయాన్నే దానిని ఆహారంగా తీసుకోవాలి. దీని వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బ్రెయిన్ ఫంక్షనాలిటీ కి కూడా సహాయపడుతుంది.
sprouts
6.మొలకలు.. మెంతుల మొలకలతో పాటు ఆయన పెసలతో తయారు చేసిన మొలకలను కూడా ఆహారంగా తీసుకుంటారు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ బి ఉంటాయి. ఆక్సీజన్ లెవల్స్ పెరుగుతాయి.యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి.
7.ఇడ్లీ, చపాతి.. వీటిని చాలా తక్కువగా తీసుకుంటారు. ఎక్కువ వ్యాయామాలు చేసిన సమయంలో వీటిని తింటారు. శరీరానికి కార్బో హైడ్రేట్స్ అవసరం అనిపించినప్పుడు మాత్రమే ఇడ్లీ, చపాతి లేదంటే మిల్లెట్స్ తీసుకుంటారు.