మగాళ్లకు బట్టతల ఇందుకే వస్తుందా?
ఒకప్పుడు 40, 50 ఏండ్లున్న మగాళ్లకు మాత్రమే బట్టతల వచ్చేది. ఇప్పుడు 25 ఏండ్లున్న యువకులకు కూడా బట్టతల వస్తుంది. అసలు బట్టతల ఎందుకొస్తుంది? జుట్టు రాలడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ జుట్టు రాలుతుంది. అయితే ఆడవాళ్లకు జుట్టు రాలడం వల్ల నెత్తి పల్చగా అయితే.. మగాళ్లకు మాత్రం చాలా మటుకు బట్టతల వస్తుంది. నిజానికి ఈ బట్టతల పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యం లేదా జన్యుపరమైన కారకాలు బట్టతలకు ఎక్కువగా దారితీస్తాయి. కానీ ఈ రెండింటిని ఆపే అవకాశమే లేదు. జెనెటిక్స్ వల్ల బట్టతల ఖచ్చితంగా వస్తుంది. దీన్ని మీరేం చేసినా ఆపలేరు.
కానీ నేడు జుట్టు రాలడం, బట్టతల నుంచి బయటపడటానికి ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటికంటే మీరు మొదటగా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే జీవనశైలిని మెరుగుపర్చుకోవడం. వంశపారంపర్య కారకాన్ని పక్కన పెడితే.. పురుషులకు బట్టతల రావడానికి మీ జీవనశైలే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. అసలు బట్టతలకు అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Baldness
ఆహారం
మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి వివిధ పోషకాలు ఎలా అవసరమవుతాయో.. జుట్టుకు కూడా అవసరమైన పోషకాలు అవసరమవుతాయి. వీటిని మనం ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఒకవేళ మీ ఆహారంలో పోషకాలు లోపిస్తే మీ ఆరోగ్యమే కాదు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పోషకాల లోపం వల్ల కూడా పురుషులకు బట్టతల వచ్చే అవకాశం ఉంది.
అలవాట్లు
నిద్రలేమి, మద్యపానం, ధూమపానం వంటి ఇతర జీవనశైలి అలవాట్లు కూడా మీ జుట్టుపై ప్రభావం చూపుతాయి. మీరు కంటినిండా నిద్రపోకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. మాదకద్రవ్యాల వాడకం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశముంది.
baldness men
హెయిర్ కేర్ ప్రొడక్ట్స్
జుట్టు సంరక్షణ ఉత్పత్తులు లేదా స్టైలింగ్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే అలవాటు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతుంది. మీరు జన్యుపరంగా బట్టతల బారిన పడినప్పుడు మీ జుట్టు త్వరగా ప్రభావితమవుతుంది.
ఒత్తిడి
జుట్టు రాలడానికి దారితీసే మరో కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. ఈ ఒత్తిడి.. నిద్ర సమస్యలు, ఆహార లోపాలతో ముడిపడి ఉంటే.. మీ జుట్టే కాదు మీ చర్మం కూడా ప్రభావితమవుతుంది. ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే వారికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది.
baldness in men
అంటువ్యాధులు
నెత్తిమీద పునరావృతమయ్యే అంటువ్యాధులు కూడా జుట్టు రాలడానికి దారితీస్తాయి. అందుకే ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చర్మవ్యాధి నిపుణుడిని చూడటం ద్వారా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
చికిత్సలు...
ఇంతకు ముందు చెప్పినట్లుగా, పురుషులలో జుట్టు రాలడం మరియు బట్టతల కోసం నేడు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పోషకాహార చికిత్స, తక్కువ-స్థాయి లైట్ థెరపీ, మైక్రో-నీడ్లింగ్తో మీసోథెరపీ, ప్లేట్లెట్ అధికంగా ఉండే ప్లాస్మా, జుట్టు పునరుద్ధరణ లేదా జుట్టు మార్పిడి అందుబాటులో ఉన్న కొన్ని ఎంపికలు. ముందుగా మీ జీవనశైలిని మెరుగుపరుచుకుందాం. ఆ తర్వాత చికిత్సలకు వెళితే సరిపోతుంది.