కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు ఆలుగడ్డ తినొచ్చా? తినకూడదా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొత్తం ప్రపంచంలోని జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారట. కానీ ఈ కొలెస్ట్రాల్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.

High Cholesterol
ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటూ.. రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తుండాలి. ఈ అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తాయి.
High Cholesterol
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలను, పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ ను మరింత పెంచే ప్రమాదముంది. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే బంగాళా దుంపలను తింటే ఎంత మంచిదో తెలుసా..?
బంగాళాదుంపలు రుచిగా ఉంటాయి. అంతేకాదు దీనిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ బంగాళదుంపల్లో కరిగే ఫైబర్ తో పాటుగా ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది జీవక్రియకు సహాయపడుతుంది.
బంగాళాదుంపలలో ఉండే సల్ఫ్యూరిక్ ఫైబర్ తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు పైత్యరస ఆమ్లాన్ని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. పైత్యరస ఆమ్లం కొలెస్ట్రాల్ తో ముడిపడి ఉంటుంది. దీని వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి కూడా.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆలుగడ్డలో ఉండే సస్టెనెన్స్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, శరీర మంట వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే దీన్ని తరచుగా తినడం చాలా ముఖ్యం.
బంగాళదుంపలలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వారు వీటిని ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు. బంగాళాదుంపలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటుగా.. శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
అయితే బంగాళాదుంపలను నూనెలో వేయించడం వల్ల దానిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. వీటిని తిన్న మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే బంగాళాదుంపలను వండి లేదా ఉడికించి తీసుకోండి. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు. అలా అని బంగాళాదుంప చిప్స్ ను మాత్రం తినకూడదు. ఇవి కొలెస్ట్రాల్ పెరగడానికి దారీతీస్తుంది.