ఉదయం లేవగానే ఫోన్ చెక్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా??..

First Published Apr 6, 2021, 11:16 AM IST

ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఇటీవల చాలా కామన్ అయ్యింది. ఫోన్ లేకుండా.. ఎప్పటికప్పుడు ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టా.. ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతుందో చెక్ చేసుకోకపోతే అస్సలు మనసున పట్టదు. పని ఉన్నా లేకపోయినా.. ఎంత పనిలో ఉన్నా ప్రతీ ఐదు నిముషాల కోసారి తప్పనిసరిగా ఫోన్ చెక్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.