ప్రపంచంలో మాంసాహారాన్ని నిషేధించిన మొట్ట మొదటి నగరం ఏంటో తెలుసా.? మన దేశంలోనే..
తిరుమల కొండపై మాంసాహారంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఓ నగరంలో పూర్తిగా మాంసాహారంపై నిషేధం ఉందని మీకు తెలుసా? ప్రపంచంలో మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించిన మొట్ట మొదటి నగరం ఏంటో తెలుసా.? మన దేశంలోనే ఉన్న ఆ నగరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లాలో ఉన్న పాలాటానా నగరం ప్రపంచంలో మాంసాహారంపై నిషేధం విధించిన మొట్ట మొదటి నగరంగా నిలిచింది. ఈ నగరంలో మాంసాన్ని పూర్తిగా నిషేధించారు. అమ్మడంతో పాటు తినడంపై కూడా పూర్తిగా నిషేధం ఉంది.
మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణంగా ఈ నగరం నిలిచింది. కాగా మాంసం కోసం జంతువులను చంపడం, మాంసం అమ్మడంతో పాటు తినడం కూడా ఈ నగరంలో నేరంగా పరిగణిస్తారు.
పాలిటానా నగరంలో మాంసంతో పాటు గుడ్ల అమ్మకాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. జంతువులను చంపడాన్ని ఇక్కడ పూర్తిగా నిషేధం. జంతు హింసను పూర్తిగా నిషేధించిన మొట్టమొదటి నగరంగా ఇది నిలిచింది.
ఈ నగరంలో జైనులు ఎక్కువగా ఉంటారు. నగరంలో ఉన్న జంతు వధ ప్రదేశాలను పూర్తిగా మూసివేయాలని 200 మంది జైన సన్యాసులు నిరసన తెలిపారు. అహింసకు వ్యతిరేకంగా జైనులు చేసిన ఈ నిరసనతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
మాంసం తినడం వ్యతిరేకించేవారు, మాంసం చూడటం కూడా మానసికంగా ఇబ్బంది కలిగిస్తుందని, ముఖ్యంగా పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతందని పాలిటానా నగరానికి చెందిన జైన సన్యాసులు నిరసన తెలిపారు. దీంతో అక్కడి కోర్టు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించింది.
ఇదిలా ఉంటే పాలిటానా తీర్పు తర్వాత, గుజరాత్‌లోని రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్ నగరాల్లో కూడా ఇలాంటి నిబంధనలు అమలు చేశారు. రాజ్‌కోట్‌లో మాంసాహార వంటకాలు, బహిరంగ ప్రదేశాల్లో మాంసం ప్రదర్శనను నిషేధించారు.
శత్రుంజయ కొండల్లో 800కు పైగా జైన దేవాలయాలున్న పాలిటానా నగరాన్ని నగరాన్ని 'జైన దేవాలయాల నగరం' అంటారు. ఇక్కడి ఆదినాథ దేవాలయం వంటి పవిత్ర స్థలాలు ప్రతి ఏటా వేలాది మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అందుకే ఇక్కడ మాంసాహారం అనేది అస్సలు కనిపించదు.