వీళ్లు జుట్టుకు నూనె పెట్టొద్దు
నిజానికి జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది జుట్టుకు నూనె పెట్టకపోవడమే మంచిది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
hair oiling
హెయిర్ కేర్ టిప్స్ గురించి మన అమ్మైనా, అమ్మమ్మైనా ఖచ్చితంగా జుట్టుకు నూనె పెట్టమని సలహానిస్తుంటారు. నిజానికి జుట్టుకు నూనె పెట్టడం ఎన్నో ఏండ్లుగా వస్తోంది. జుట్టు సంరక్షణ దినచర్యలో హెయిర్ కి ఆయిల్ ని పెట్టడం ఒక ముఖ్యమైన భాగం. జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు మూలాలకు పోషణ అందుతుంది. అలాగే జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఇవే కావు నూనెతో జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయినా కానీ కొన్ని సార్లు జుట్టుకు నూనె పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని పరిస్థితుల్లో జుట్టుకు నూనె పెట్టకుండా ఉండాలి. లేకపోతే మీ జుట్టు దెబ్బతింటుంది.
hair oiling
జుట్టుకు ఎప్పుడు నూనె పెట్టకూడదు?
చుండ్రు ఉంటే..
చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీ నెత్తిమీద చుండ్రు ఉంటే గనుక మీరు జుట్టుకు నూనె పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే దీనివల్ల నెత్తిమీద చుండ్రు మరింత పెరుగుతుంది. ఎలా అంటే మనం తలకు నూనె రాసినప్పుడు చుండ్రు జుట్టుకు, నెత్తికి క్రస్ట్ లా అంటుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో నెత్తిమీద విపరీతంగా దురద పెడుతుంది. దద్దుర్లు అవుతాయి. చిరాకు కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ముందుగా యాంటీ డాండ్రఫ్ షాంపూని వాడాలి. అలాగే హోం రెమిడీతో చుండ్రును తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాతే నూనెను పెట్టాలి.
hair oiling
మొటిమల సమస్య
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీకు మొటిమల సమస్య ఎక్కువగా ఉంటే కూడా మీరు జుట్టుకు నూనె పెట్టకపోవడమే మంచిది. ముఖ్యంగా మీ నుదిటి లేదా జుట్టు చుట్టూరా మొటిమలు ఉంటే మాత్రం అస్సలు జుట్టుకు నూనె రాసుకోకండి. ఎందుకంటే దీనివల్ల ఈ మొటిమల్లో నూనె పేరుకుపోయి మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అంతేకాదు జుట్టు పరిశుభ్రత విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మొటిమలు తొందరగా తగ్గుతాయి. ఎక్కువగా కాకుండా ఉంటాయి.
జిడ్డు నెత్తి ఉన్నవారికి
మీ నెత్తి ఎక్కువ ఆయిలీగా ఉన్నప్పుడు కూడా నూనె పెట్టుకోవడం మానేయాలి. నిజానికి ఆయిలీ నెత్తిమీద, జుట్టులో సహజ నూనె ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు మళ్లీ జుట్టుకు నూనె ఎక్కువగా పడితే నెత్తిమీద దురద పెడుతుంది. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలే ప్రమాదం కూడా ఉంది. మీరు జుట్టుకు నూనె పెట్టాలనుకుంటే జుట్టు దిగువ భాగాలకే మాత్రమే పెట్టండి. అలాగే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే జుట్టుకు నూనె రాసుకోవాలి.
మీకు ఫోలిక్యులిటిస్ ఉంటే
ఫోలిక్యులిటిస్ అంటే బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే ఒక సాధారణ నెత్తిమీది సమస్య. దీనివల్ల తలపై చిన్న చిన్న మొటిమలు, వాపు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు మీరు జుట్టుకు నూనె పెట్టకపోవడమే మంచిది. ఇలాంటి పరిస్థితిలో మీరు జుట్టుకు నూనె పెడితే ఈ ఫోలిక్యులిటిస్ సమస్య మరింత పెరుగుతుంది.