muharram 2022: ఇండియా, సౌదీ అరేబియా, ఒమన్, ఇతర దేశాలలో అషురా తేదీ ఎప్పుడంటే..!
muharram 2022: ఇండియా, పాకీస్తాన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఒమన్, కెనడా, ఇరాన్, ఆస్ట్రేలియా, యుకె, యుఎస్ఎ తో పాటుగా ఇతర దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఈ సంవత్సరం అషురా ను లేదా మొహర్రం పదవ రోజును జరుపుకుంటారు.

ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని అల్ హిజ్రీ లేదా అరబిక్ నూతన సంవత్సరం అని కూడా పిలుస్తారు. ముహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు ఈ పవిత్ర మాసంలోనే వలస వస్తారు. అందుకే ఈ పవిత్రమైన మాసంలో మొహర్రం మొదటి రోజుకు జరుపుకుంటారు. కాని అషూరా అనేది ఈ పవిత్ర నెల 10 వ రోజున వస్తుంది. ఈ రోజున ప్రవక్త ముహమ్మద్ మనుమడు ఇమాం హుస్సేన్ అమరుడైన జ్ఞాపకార్థంగా.. ముస్లింలంతా శోకసంద్రంలో మునిగిపోతారు. మొహర్రం అనే పదానికి 'అనుమతి లేదు' లేదా 'నిషేధించబడిందని అర్థం. అందుకే ముస్లింటు యుద్ధం వంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటారు. దీనిని ప్రార్థన, ప్రతిబింబాల కాలంగా ఉపయోగిస్తారు.
మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల. తరువాత చాంద్రమాన మాసాలైన సఫర్, రబీ-అల్-థాని, జుమదా అల్-అవల్, జుమదా అత్-థానియా, రజబ్, షబాన్, రంజాన్, షవ్వాల్, జు అల్-ఖదాహ్, జు అల్-హిజ్జా వస్తాయి. రంజాన్ తర్వాత మొహర్రం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం.
ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్:
ఇస్లామీయ క్యాలెండర్ lunar cycle పై ఆధారపడి ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ మాదిరిగా కాకుండా సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ లో నెలకు 30 లేదా 31 రోజులు ఉండగా, lunar calendar లో ఒక నెల చంద్రుని దృశ్యాన్ని బట్టి 29 లేదా 30 రోజులు ఉంటుంది.
అమావాస్య లేదా నెలవంకను (నెల 29 వ తేదీ) చూసినప్పుడు కొత్త నెల ప్రారంభమవుతుంది. ఒకవేళ 29వ తేదీన నెలవంక కనిపించనట్లయితే.. ప్రస్తుతం ఉన్న నెల 30 రోజులు పూర్తి అవుతుంది. మరుసటి రోజు కొత్త నెల ప్రారంభం అవుతుంది.
ఆషూర తేదీ:
365 రోజులను కలిగున్న గ్రెగోరియన్ క్యాలెండర్ లా కాకుండా.. ఇస్లామిక్ క్యాలెండర్ 354 రోజులను 12 నెలలుగా విభజించింది. అలాగే దేశాన్ని బట్టి మారుతూ ఉండే నెలవంక చంద్రుని వీక్షణపై ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం ఇస్లామిక్ నూతన సంవత్సరాన్ని హిజ్రీ 1444 ఎహెచ్ (లాటిన్ లో అన్నో హెగిరే లేదా హిజ్రా సంవత్సరం) అని పిలుస్తారు.
అంటే మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు వలస వచ్చి 1444 సంవత్సరాలు అయిందన్న మాట. ఈ సంవత్సరం యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్,ఇరాక్, బహ్రెయిన్ ఇతర అరబ్ రాష్ట్రాలతో సహా మధ్యప్రాచ్యం అంతటా ముస్లింలు కొత్త ఇస్లామిక్ సంవత్సరం 1444 హెచ్ శనివారం జూలై 30, 2022 న ప్రారంభమైంది. ఇది పవిత్ర మొహర్రం అల్ హరామ్ మొదటి రోజు.
అందుకే ఈ దేశాలలో అషురా ఆగస్టు 8, 2022 న వస్తుంది. భారతదేశం, న్యూఢిల్లీలోని ఇమారత్-ఎ-షరియా హింద్ 2022 జూలై 31 ఆదివారం ఇస్లామిక్ న్యూ ఇయర్ 1444 ఎహెచ్, 2022 ఆగస్టు 09 న అంటే మంగళవారం యూమ్-ఎ-అషూరా ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, యుఎస్ఎ, మొరాకో, ఇరాన్ లో అషురా ఆగస్టు 08, 2022 న వస్తుంది.