పురుషులు రోజూ షాంపూ చేస్తే ఏమౌతుంది?
షాంపూ చేసిన రోజు మన జుట్టు చాలా అందంగా కనపడుతుంది. అందుకే ఎక్కువ మంది రెగ్యులర్ గా షాంపూ చేయడానికి ఇష్టపడతారు. కానీ, పురుషులు రోజూ షాంపూ చేస్తే ఏమౌతుంది?
బ్యూటీ, హెయిర్ విషయంలోఅమ్మాయిలకు ఉన్న శ్రద్ధ.. అబ్బాయిలు పెట్టరు. చాలా తక్కువ మంది అబ్బాయిలు మాత్రమే హెయిర్ కేర్ ఫాలో అవుతుంటారు. కానీ, స్త్రీలకు జుట్టు పట్ల శ్రద్ధ ఎంత అవసరమో.. పురుషులకు కూడా అంతే అవసరం అంట. మరి, అలా అని వారు రోజూ షాంపూ చేస్తే ఏమౌతుంది? అలా రోజూ తలస్నానం చేయవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...
పురుషులు రోజూ షాంపూ చేయకూడదట. ఇలా చేయడం వల్ల జుట్టుకు జరిగే మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే, మార్కెట్లో దొరికే చాలా షాంపూల్లో సల్ఫేట్ సహా ఇతర రసాయనాలు ఉంటున్నాయి. ఇవి.. జుట్టుకు హాని చేస్తాయి. మీరు మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందు సల్ఫేట్ లేని షాంపూని ఎంచుకోవడం చాలా అవసరం. అవి జుట్టుకు హాని చేయకుండా ఉంటాయి.
మీరు వాడే షాంపూ లో సల్ఫేట్, ఇతర రసాయనాలు కనుక ఉంటే.. ఆ షాంపూని మీరు ప్రతిరోజూ వాడితే, మీ జుట్టు త్వరగా తెల్లబడి, రాలడం మొదలవుతుంది. కాబట్టి వారానికి ఎన్నిసార్లు షాంపూ వాడాలో ఇక్కడ తెలుసుకోండి.
అబ్బాయిలు.. మీరు ప్రతిరోజూ షాంపూ వాడితే, దానిలోని రసాయనాలు మీ జుట్టులోని సహజ నూనెలను తొలగిస్తాయి. దాని వల్ల జుట్టు ఎప్పుడూ నిర్జీవంగా కనిపిస్తుంది. జుట్టుకు ఉన్న అందం పోతుంది. కాబట్టి వారంలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే వాడండి. ఎక్కువ సార్లు చేస్తే మీరే జుట్టు లాస్ అవుతారు.
షాంపూ చుండ్రు, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, దీన్ని ఎక్కువగా వాడితే జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోతాయి. నెత్తి పొడిబారి, జుట్టు రాలే సమస్య వస్తుంది. మీరు వ్యాయామం చేస్తే లేదా బాగా చెమట పడితే ఎక్కువ షాంపూ వాడొచ్చు. కానీ, అతిగా వాడకండి.
పొడి జుట్టు ఉన్నవారు రోజూ షాంపూ వాడకూడదు. లేదంటే జుట్టు తెల్లబడి, త్వరగా రాలిపోతుంది. ఒక్కసారి హెయిర్ లాస్ మొదలైందంటే దానిని ఆపలేం. వీలైనంత వరకు వారానికి రెండు లేదంటే మూడు సార్లు మాత్రమే షాంపూ చేయడం మంచిది. అది కూడా సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడటం మీ జుట్టుకు మంచిది అనే విషయం తెలుసుకోవాలి.