cholesterol: ఈ సమ్మర్ ఫ్రూట్స్ తో కొలెస్ట్రాల్ ఈజీగా కరిగిపోతుంది తెలుసా..?
cholesterol: ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరగాలంటే హెవీ వర్కౌట్స్, డైటింగ్ తో పాటుగా.. ఈ సమ్మర్ లో లభించే కొన్ని పండ్లను తింటూ ఉండాలి.ఈ పండ్లు కూడా కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఎంతో సహాయపడతాయి.

cholesterol
cholesterol: ఈ ఆధునిక కాలంలో కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణం అయిపోయింది. ఈ సమస్య బారిన పెద్దవాళ్లే కాదు యువత సైతం పడుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. చెడు ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పేరుకుపోతున్నాయి.
cholesterol
ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హై కొలెస్ట్రాల్ వల్ల ఒక్కో సారి ప్రాణాల మీదికి కూడా రావొచ్చు. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే ఇంకోటి చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ మన ప్రతి కణంలోనూ ఉంటుంది.
ఇకపోతే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే.. Blood flow కష్టతరమవుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. అయితే మనం తీసుకునే కొన్నిరకాల ఆహార పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..
బొప్పాయి.. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బొప్పాయి పండును రెగ్యులర్ గా తినడం వల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. అంతేకాదు Digestionను మెరుగుపర్చడానికి ఈ పండులో ఉండే ఫైబర్ ఎంతో సహాయపడుతుంది. ఇది ప్రేగులను కూడా క్లీన్ చేయడానికి తోడ్పడుతుంది. రెగ్యులర్ గా బొప్పాయి పండును తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండటానికి సహాయపడుతుంది. ఈ పండు ఆకలిని కూడా తగ్గిస్తుంది. దీన్నితింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉంటుంది. దీంతో మీరు ఫుడ్ ను మితిమీరి తినలేరు. బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. పీచు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే ఓవర్ వెయిట్ నుంచి చాలా తొందరగా బయటపడతారు.
ద్రాక్ష.. ద్రాక్ష పండ్లలో పైబర్ కంటెంట్ ఫుష్కలంగా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కరుగుతాయని ఎన్ సీబీఐ నివేధిక వెల్లడిస్తోంది. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా.. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ ఎంతో సహాయడతాయి. ఇవి గుండె కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
=
సిట్రస్ ఫ్రూట్స్.. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో నిరూపించబడింది. ఈ సీజన్ లో లభించే ఆరెంజ్, నిమ్మకాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే.. మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల మీ రోగ నిరోధక శక్తికూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా ఇట్టే కరిగిపోతుంది.
ఆపిల్.. శరీరంలోని పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఆపిల్ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఈ ఆపిల్ పండు కొలెస్ట్రాల్ ను కరిగించడంతో పాటుగా.. మన ఒంట్లో ఉండే చెడు పదార్థాలను కూడా బయటకు పంపడానికి సహాయపడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు రోజుకో ఆపిల్ పండును తింటే.. గుండె సమస్యలను నుంచి బయటపడొచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఎంతో తోడ్పడుతుంది.
స్ట్రాబెర్రీస్.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కరిగించడానకి స్ట్రాబెర్రీలు ఎంతో సహాయపడతాయని ఎన్ సీబీఐ నివేదిక స్పష్టం చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఓవర్ వెయిట్ సమస్య నుంచి కూడా తొందరగా బయపడతారు. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది.