Curry leaves Benefits: కరివేపాకును ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
Curry leaves Benefits: కరివేపాకు కూరలకు అదిరిపోయే రుచిని ఇవ్వడమే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందులో ఉదయం పూట పరిగడుపున ఈ కరివేపాకును తింటే ఎన్నో అద్బుతాలు జరుగుతాయి.
Curry leaves Benefits:భారతీయ వంటకాల్లో కరివేపాకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వంటకాల్లో కరివేపాకును వేయడం వల్ల ఆ కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఈ కరివేపాకు వంటలకు రుచిని కలిగించడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకులో (Curry leaves) విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ సి, పాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణ వ్యవస్తను మెరుగు పరచడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అంతేకాదు కాలెయం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా కరివేపాకు బాగా సహాయపడుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి చక్కటి చిట్కాలా కూడా ఉపయోగపడుతుంది. అందులో ఈ కరివేపాకును ఉదయం పూట తింటే ఇన్నో అద్బుత ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసా..
ప్రతి రోజూ.. మార్నింగ్ టైంలో పరిగడుపున కరివేపాకు తింటే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఫ్రెష్ గా అనిపిస్తుంది. దీనికి కోసం మీరు ఏం చేయాలంటే.. కొన్ని కరివేపాకు రెబ్బలను తీసుకుని వాటిని జ్యూస్ లా తయారుచేసుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం, కొంచెం చక్కెర వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం పూట పరిగడుపునే తాగాలి. ఇలా తాగడం వల్ల వికారం, వాంతుల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కాలెయం ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. అంతేకాదు కాలెయం మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
సిర్రోసిస్ ప్రమాదం రాకుండా చేయంలో కూడా ఈ జ్యూస్ ముందుంటుంది. ఇంతేకాదు Digestive system బాగా పనిచేసేలా సహాయపడుతుంది. కాలెయం బలంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకు రెబ్బలను పరిగడుపున తినడం వల్ల మలబద్దకం, అజీర్థి, అసిడిటీ, కడుపు నొప్పి వంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. హెయిర్ ఫాల్ సమస్యకు కూడా చెక్ పెడుతుంది.
స్థూలకాయులకు కరివేపాకు మంచి మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారు ప్రతి రోజూ కరివేపాకును తినడం అలవాటు చేసుకోండి. ఈ కరివేపాకు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా Cholesterol ను తగ్గించడంలో కూడా ముందుంటుంది. దీనికోసం.. ప్రతి రోజు మార్నింగ్ టైం లో కరివేపాకులతో పాటుగా తులసి ఆకులను కలుపుని తింటే మంచి ఫలితం వస్తుంది. కాగా కరివేపాకులో విటమిన్ ఏ అధిక మొత్తంలో లభిస్తుంది. దీన్ని తినడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పరిగడుపున కరివేపాకులను తినండి.. ఆరోగ్యంగా ఉండండి.