మీరు అర్జెంటుగా డాక్టర్ ను సంప్రదించాలని.. మీ మూత్రపిండాలు చెప్పే సంకేతాలివే..!
మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో మూత్రపిండాలు ఒకటి. వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీ ఆరోగ్యం అంత పదిలంగా ఉంటుంది. అయితే మీ మూత్రపిండాలు దెబ్బతింటే మీలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యుడిని సంప్రదించకపోతే మీరు డేంజర్ జోన్ లో పడతారు జాగ్రత్త..

మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే శరీరం నుంచి విషాన్ని, వ్యర్థాలను కూడా తొలగిస్తాయి. చిక్కుడుగింజ ఆకారంలో ఉండే.. ఈ అవయవాలు పిడికిలంత సైజులో ఉంటాయి. ఇవి వెన్నెముకకు ఇరువైపులా పక్కటెముక పంజరం దిగువన ఉంటాయి. మన శరీరంలోని మొత్తం రక్తం రోజుకు 40 సార్లు మూత్రపిండాల గుండానే వెళుతుంది.
మూత్రపిండాల లోపల ఎన్నో ముఖ్యమైన జీవ విధులు జరుగుతాయి. ఇలాంటి మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా..? చేయడం లేదా అనేది గుర్తించడం చాలా కష్టం. ఒకవేళ మూత్రపిండాలు దెబ్బతింటే వీటిని ప్రారంభ దశలోనే గుర్తించాల్సిన ఉంటుంది. లేదంటే రోగం ముదిరి సమస్య మరింత పెద్దదవుతుంది. మరి మూత్రపిండాలు దెబ్బతింటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం పదండి..
తరచుగా అలసిపోవడం
ఈ మధ్యకాలంలో మీరు తరచుగా అలసిపోతున్నటనిపిస్తే మీ మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో విషాలు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ శరీర ఇతర జీవ విధులను ప్రభావితం చేస్తాయి. అలాగే రక్తంలో మలినాలు పేరుకుపోవడం వల్ల కూడా ఇలా అలసిపోతారు.
సరిగ్గా నిద్రపట్టకపోవడం
దీనికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. మూత్రపిండాల వ్యాధి నిద్రపట్టకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. స్లీప్ అప్నియా లేదా కంటి నిండా నిద్రలేకపోవడం అనేది మూత్రపిండాల వ్యాధితో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.
పొడి చర్మం, దురద, డ్రైనెస్
శరీరం నుంచి విషం తొలగిపోతేనే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక శరీరంలో ట్యాక్సిన్స్ పేరుకుపోతే శరీరంలోని ఇతర పోషకాలు, ఖనిజాల పరిమాణం బాగా పెరిగిపోతోంది. దీంతో చర్మంపై దురద పెడుతుంది. అలాగే చర్మం పొలుసులుగా మారుతుంది. అంతేకాదు చర్మం పొడిగా కూడా అవుతుంది. ఇది ఎముకలకు కూడా హాని కలిగిస్తుంది.
పాదాల వాపు
మూత్రపిండాలు అనారోగ్యం బారిన పడితే శరీరంలోని విషాన్ని పూర్తిగా తొలగించలేవు. దీంతో శరీరంలో ట్యాక్సిన్స్ పేరుకుపోయి వాటి ప్రభావాన్ని శరీరంపై చూపుతాయి. అయితే మూత్రపిండాలు శరీరంలో అధిక మొత్తంలో ఉండే సోడియాన్నితొలగించకపోవడం వల్ల పాదాలు, చీలమండలు, కాళ్లలో ఇది పేరుకుపోతుంది. దీంతో ఇవి ఉబ్బుతాయి. అయితే పాదాల వాపు ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అయితే ఈ వాపు ఎక్కువ కాలంగా కొనసాగితే మాత్రం మీ మూత్రపిండాలు దెబ్బతిన్నాయని అర్థం చేసుకోవాలి.
kidney
కళ్ల చుట్టూ ఉబ్బడం
కొంతమందికి ఎప్పుడూ కళ్ల చుట్టు ఉబ్బుతుంది. ఇలాంటి వారు మూత్రపిండాల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మూత్రపిండాలు పనిచేయకపోవడం శరీరంలో అదనపు సోడియం పేరుకుపోవడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం ఉబ్బుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు మూత్రంలో ప్రోటీన్లు బయటకు పోవు. దీంతో కళ్లు ఉబ్బుతాయి.
kidney
కండరాల నొప్పి
మూత్రపిండాలు పనిచేయలేని స్థితిలోకి వెళ్లినప్పుడు శరీరంలో వ్యర్థ ట్యాక్సిన్స్ స్థాయిలు ఎక్కువ అవుతాయి. ఇక శరీరంలో అవసరం లేని ఖనిజాలు పేరుపోతే కూడా కండరాల్లో విపరీతమైన నొప్పి పుడుతుంది. కండరాల నొప్పిని ఎప్పుడూ లైట్ తీసుకోకండి. ఇది ఎన్నో అంతర్గత వ్యాధులను సూచిస్తుంది. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
సరిగ్గా శ్వాత తీసుకోలేకపోవడం
మూత్రపిండాల్లో ఏదైన సమస్య తలెత్తితే కూడా శ్వాస సరిగ్గా తీసుకోలేరు. ఇలా జరగడానికి కారణం ఎరిథ్రోపోయిటిన్ అని పిలిచే హార్మోన్ లేకపోవడం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఎర్రకర్త కణాలను తయారు చేయడానికి హార్మోన్లు సంకేతాలు ఇస్తాయి. ఇది లేకుంటే మీరు రక్తహీనత సమస్య బారిన పడొచ్చు. దీనివల్లే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
మూత్రవిసర్జణలో మార్పు
మూత్రవిసర్జన క్రమం తప్పకుండా వచ్చే ఫ్రక్వెన్సీ నుంచి పెరిగినా లేదా తగ్గినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే ఇలా మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడే జరుగుతుంది.