గర్భిణులు సన్ స్క్రీన్ లోషన్ ను పెట్టుకోవడం బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదా..?
గర్భధారణ సమయం ఎంతో అందమైంది. ఎంతో మధురమైంది. కానీ ఈ సమయంలో మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. చర్మం లోపల కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
మండుతున్న ఎండలకు చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ సూర్యుని నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాలను చర్మానికి హానీ చేస్తాయి. ఇక వీటిని నివారించడానికి చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేస్తుంటారు. సన్ స్క్రీన్ ను అప్లై చేస్తే.. చర్మం సూర్యుని యొక్క యువీ కిరణాల నుంచి రక్షించబడుతుంది.
అందం, చర్మ సంరక్షణ కోసం ఎండలో బయటకు వెళ్ళే ముందు ఖచ్చితంగా బాడీకి సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది మంచి పరిష్కారం కూడా. కానీ గర్భిణులు దీన్ని ఉపయోగించడం మంచిదేనా? వీటిని అప్లై చేయడానికి ముందు ఇది వీరికి సురక్షితమా? కాదా? అని తెలుసుకోవాలి.
గర్భధారణ సమయంలో సన్ స్క్రీన్ అప్లై చేయవచ్చా: గర్భిణులు కూడా సన్ స్క్రీన్ ను ఉపయోగించవచ్చు. గర్భధారణ సమయంలో యువి కిరణాలు నేరుగా బిడ్డపై పడవు. అందువల్ల తల్లి చర్మానికి ఏదైనా నష్టం వాటిల్లినా.. బిడ్డపై ఎలాంటి ప్రభావం పడదు. అయినప్పటికీ.. గర్భిణులు సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలనుకుంటే.. రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పదార్థాలను కలిగి ఉన్న సన్ స్క్రీన్ లోషన్నే ఉపయోగించాలి.
సన్ స్క్రీన్ మీద ఏముండాలి: గర్భధారణ సమయంలో చర్మం మారుతుంది. ఈ సమయంలో స్త్రీల చర్మం కొన్ని పదార్థాలకు భిన్నంగా ప్రతిస్పందించవచ్చు. అదే సమయంలో శిశువు తొమ్మిది నెలల వరకు తల్లిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు గర్భధారణ సమయంలో రసాయన రహిత పదార్థాలను ఉపయోగించాలి. మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఆహారం పట్ల శ్రద్ధ తీసుకున్నట్లే, మీ చర్మానికి వాడే అన్ని క్రీమ్స్ గురుంచి జాగ్రత్త వహించాలి.
కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్ లో ఎండోక్రైన్ డిస్పార్ అని పిలువబడే హానికరమైన ఆక్సీబెంజోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు హానికరం. కాబట్టి మీ సన్ స్క్రీన్ ఈ పదార్థం ఎక్కువగా లేదని నిర్ధారించుకోండి . అలాగే సరైన రసాయన రహిత సన్ స్క్రీన్ ను ఎంచుకోండి.
2018 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో గర్భధారణ సమయంలో ఆక్సీబెంజోన్ కలిగి ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల క్షీర గ్రంధులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని వెల్లడైంది. ఇది శిశువు పుట్టిన తరువాత శిశువు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే దీనిని ఉపయోగించడం మానుకోవాలి.
అత్యంత హానికరమైన ఆక్సిబెంజోన్.. సముద్ర క్షీరదాలు మరియు మానవుల వీర్యం, ప్లాసెంటా మరియు తల్లి పాలను కలుషితం చేస్తుందని చాలా అధ్యయనాలు చూపించాయి. ఆక్సీబెంజోన్ గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు హానికరం. కాబట్టి మీరు ఉపయోగించే సన్ స్క్రీన్ లో ఆక్సీబెంజోన్ లేదని నిర్ధారించుకోండి.
సన్ స్క్రీన్ ను ఎలా ఉపయోగించాలి: గర్భిణీ స్త్రీలు మినరల్/ఫిజికల్ సన్ స్క్రీన్ ను ఉపయోగించవచ్చు. మినరల్ సన్ స్క్రీన్ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్ధం. ఇది రసాయన సన్ స్క్రీన్ ల కంటే సురక్షితమైనది. మీరు దీన్ని ఉపయోగించవచ్చు.