Relationship:ఇలాంటి కారణాల వల్లే మీ రిలేషన్ షిప్ బ్రేకప్ అయ్యేది.. దీని సంకేతాలు ఎలా ఉంటాయంటే?
Relationship: వివాహ బంధమైనా, ప్రేమ అయినా ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలు, మనస్పర్తలు రావడం చాలా సహజం. కొందరు వీటికి సర్దుకుపోతుంటే.. మరికొందరు ఇవే కారణాలుగా చూపించి తమ బంధానికి బ్రేకప్ చెప్తుంటారు. అయితే ఈ భాగస్వామి మీతో బ్రేకప్ అవుతున్నారని ఎలా తెలుసుకోవాలో తెలుసా..
Relationship:ఏ బంధమైనా సరే ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమ, సర్దుకుపోయే గుణం ఉండాలి. అప్పుడే చిన్న చిన్న గొడవల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. జీవితాన్ని సంతోషంగా లీడ్ చేయగలుగుతారు. అందులోనూ ఇద్దరు వ్యక్తులు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎన్నో సంతోషాలు, చిన్న చిన్న గొడవలు, మనస్పర్తలు రావడం చాలా సహజం. వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకున్నప్పుడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు సర్దుకుపోయే గుణముండాలి. అంతేకాని అవే కారణాలుగా చూపించి విడిపోవడం వెర్రితనం అవుతుంది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు సంతోషం ఎలా వస్తుందో.. బాధకూడా అలాగే వస్తుంది.
ఇద్దరి వ్యక్తుల మధ్య సక్యత కుదరనప్పుడు విడిపోవడమే దానికి ఉన్న ఏకైక పరిష్కారమని కొందరు భావిస్తారు. దాని మూలంగానే విడిపోతుంటారు. అందుకే ఒక బంధంలో ఉన్నప్పుడు బాధకల్గించే విషయాలు కూడా ఉంటాయి. అందులోనూ మీరు ఇష్టపడినంతగా మీ భాగస్వామి మిమ్మల్ని ఇష్టపడటం లేదని తెలిస్తే ఎంతో బాధగా అనిపిస్తుంది. అందులోనూ మీ రిలేషన్ షిప్ అతి తొందరలోనే బ్రేకప్ అవబోతుందంటే మీరు దానికి సిద్దంగా ఉండాలి. బ్రేకప్ ను మీరు ఏవిధంగా ఆపలేరు గనుక.. దానిని అర్థం చేసుకుని స్వీకరించగలిగినప్పుడే ఆ బాధనుంచి కొంచెమైనా బయటపడగలుగుతారు. మరి మీ భాగస్వామి మీరు విడిపోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఏ రిలేషన్ షిప్ అయినా గొడవలు జరగడం చాలా కామన్. అలా అని భాగస్వామిని ఒంటరిగా వదిలేయకుండా బ్రతిమిలాడటం, నచ్చజెప్పడం, ప్రేమను చూపించడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ రిలేషిన్ షిప్ వారికి వద్దనుకుంటే మాత్రం ప్రేమలు చూపిండం పక్కన పెడితే కనీసం మీతో మాట్లాడటానికి, మీతో ఎక్కువ సమయం గడపడానికి కూడా వారు ఇష్టపడరు. అలాగే మీకు ప్రతిస్పందించరు. అలా చేస్తే మీపై ఆసక్తి చూపించడం లేదని అర్థం చేసుకోవాలి. ఎక్కువ కాలం వారి ప్రవర్తన ఇలాగే కొనసాగితే వారు మీకు ఖచ్చితంగా బ్రేకప్ చేస్తారని అర్థం చేసుకోవాలి.
రిలేషన్ షిప్ లో ప్రతి జంట తమకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా దాచి పెట్టరు. చిన్న చిన్న విషయాల నుంచి రహస్యాలను కూడా పంచుకుంటారు. అందులోనూ ఎవరికీ చెప్పుకోలేని విషయాలను సైతం పంచుకుంటారు. ఇలా చెప్పుకోవడానికి కారణం ఎదుటివారిపై ఉన్న ప్రేమే కారణం. అయితే మీ రిలేషన్ షిప్ బ్రేకప్ కు దగ్గర పడినప్పుడు మీ భాగస్వామి మీతో ఎలాంటి విషయాలను కూడా పంచుకోరు. ముఖ్యంగా ఎన్నో విషయాలను దాచిపెడతారు. అలా మీ భాగస్వామి కూడా ప్రవర్తిస్తే మీకు దూరంగా ఉండాలనుకుంటున్నారని అర్థం.
break up
మీ భాగస్వామి మీ పై ఇంతకు ముందు చూపించిన ఆసక్తి ఇప్పుడు చూపడం లేదా? అయితే డౌటే లేదు.. అది బ్రేకప్ కు కారణం కావొచ్చు. మీతో దూరంగా ఉంటున్నా.. దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నా మీ బంధం మరికొన్ని రోజుల్లోనే ముగుస్తుందని అర్థం చేసుకోవాలి.
So what if you do not have a partner on Valentine's Day, you can always pamper yourself with some lovely gifts.
పెళ్లైన తర్వాత వారి ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లానింగ్స్ వేసుకుంటారు. వచ్చే ఏడాది ఇలా ఉండాలి. అవి చేయాలి.. ఇవి చేయాలి అంటూ ఎన్నెన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కానీ మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి ఎలాంటి ప్లానింగ్స్ గాని విషయాల షేరింగ్ గాని లేకుంటే అనుమానించాల్సిందే. మీరు మీ ఆలోచనలను గురించి మీ భాగస్వామికి చెబుతున్నా.. వారు పట్టించుకోకపోవడం కూడా బ్రేకప్ కు దారితీసే అంశమే.