Beauty Tips: చర్మంపై నల్ల మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే నివారణ మార్గాలు ఇవే?
Beauty Tips: అందమైన చర్మం మీద చిన్న మచ్చ కూడా అసహ్యంగా కనిపిస్తుంది. తెల్లని చర్మం కలవారికి ఇది మరింత ఇబ్బంది పెట్టే సమస్య. ఈ చిట్కాలు ఉపయోగించి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూద్దాం.

అందమైన చర్మం మీద వచ్చే నల్ల మచ్చలు ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. తెల్లని చర్మం మీద వచ్చే చిన్న మచ్చ కూడా ఎంతో అసహ్యంగా కనిపిస్తుంది. అందులోనూ తెల్లని శరీరం ఉన్నవారు ఈ మచ్చలకి ఎక్కువగా ఇబ్బంది పడతారు అయితే ఈ సమస్యని నివారించుకోవడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది.
ఈ నేచురల్ రెమెడీస్ ఉపయోగించటానికి ముందు స్కిన్ టెస్ట్ చేసిన తర్వాత నేరుగా స్కిన్ ప్యాచ్ లు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అప్లై చేయకూడదు. ఒకటికి పది సార్లు ఆలోచించుకుని రెమెడీస్ ని ఫాలో అవ్వండి.
మచ్చలకి మంచి మందు నిమ్మరసం నిమ్మకాయని సకానికి కట్ చేసి చర్మం మీద అప్లై చేసి బాగా రుద్దాలి. తడి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి తరువాత నాలుగైదు గంటలసేపు ఎండలో తిరగకుండా ఉండాలి.
ఇలా చేయడం వలన మచ్చల డార్క్ నెస్ తగ్గుతుంది. మచ్చలకి తిరుగులేని మరో ఔషధం పెరుగు. ఒక చెంచా పెరుగులో రెండు చెంచాల నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ కలిపి చర్మానికి అప్లై చేయండి. దీనివల్ల ఈ మిశ్రమంలో ఉండే లాక్టిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ లక్షణాలు డార్క్ ప్యాచ్ లని నివారిస్తాయి.
పాలు కలిపిన నీటితో ఒక వారం రోజులపాటు స్నానం చేయడం వలన పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ శరీరంలో కనిపించే నల్ల మచ్చలని నేచురల్ గా మాయం చేస్తాయి.అలాగే శరీరం మీద ఉండే నల్ల మచ్చలు అని కలబంద గుజ్జుతో కూడా పోగొట్టుకోవచ్చు.
ముందుగా కలబంద గుజ్జుతో మొఖం మీద నేరుగా మసాజ్ చేసి ఆ తరువాత పాలతో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఒక వారం తర్వాత మళ్లీ ఇలాగే చేయాలి. ఇది కూడా మచ్చలు మాయం అవ్వటానికి మంచి ఔషధం. అలాగే టమాటా జ్యూస్ లో నిమ్మరసం కలిపి కళ్ళ కింద మసాజ్ చేయటం వలన కూడా మచ్చల నుంచి ఉపశమనం పొందవచ్చు.