ఇదొక్కటి చేస్తే.. రాత్రిపూట కంటినిండా నిద్రపోతారు
చాలా మందికి సరిగ్గా నిద్రే ఉండదు. రాత్రిళ్లు నిద్ర రాక బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ నిద్రకోసం పడిగాపులు కాస్తుంటారు. ఇలాంటి వారు ఒక పనిచేస్తే తొందరగా నిద్రపడుతుంది. అదేంటంటే?
చిన్నపిల్లలు నిద్రపోయినట్టు పెద్దలు నిద్రపోలేరు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతుంది. కొంతమందికి అయితే అసలు నిద్రేరాదు. నిద్ర ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ నిద్రలేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో నిండిన జీవితంలో వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి వారు ఏం చేస్తే బాగా నిద్రపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సరైన గది ఉష్ణోగ్రత
ఒత్తిడితో నిండిపోయిన జీవితంలో రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడానికి గది ఉష్ణోగ్రతను సెట్ చేయాలి. ఎండాకాలంలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రతను మీ శరీరం కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీరు బాగా నిద్రపోగలుగుతారు.
రాత్రిపూట స్నానం
చాలా మంది పొద్దంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు రాత్రి అని కూడా చూడకండా స్నానం చేస్తుంటారు. నిజానికి ఇలా రాత్రిపూట స్నానం చేయడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు చల్లని నీటినే వాడాలి.రాత్రిపూట కూల్ వాటర్ తో స్నానం చేయడం వల్ల అలసట కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలాగే ఇది మీకు రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
వాటర్ బ్యాగ్
రాత్రిపూట ఒక సైడు నుంచి ఇంకో సైడుకు మల్లడం వల్ల కూడా నిద్ర డిస్టబెన్స్ అవుతుంది. ఇలాంటప్పుడు మీకు నిద్రరాకపోతే మీరు వాటర్ బ్యాగ్ సహాయం తీసుకోండి. మీరు చేయాల్సిందల్లా మీ కాళ్ల మధ్య చల్లని నీటితో నిండిన నీటి సంచిని ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గి బాగా నిద్ర పడుతుంది.