శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..
ఈ రోజుల్లో చాలా మంది మగవారు శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్నారు. సెక్స్ లో పాల్గొన్న కొద్ది సేపటికే వీర్యం పడిపోతే.. ఆ తర్వాత సెక్స్ లో పాల్గొనడం ఇంపాజిబుల్. ఒకవేళ పాల్గొన్నా.. అది తొందరగా ముగిసిపోతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సెక్స్ లో పాల్గొనడానికి ముందు లేదా పాల్గొన్న కొద్దిసేపటి తర్వాత వీర్యం విడుదల కావడాన్నే శీఘ్ర స్ఖలనం (PE) అంటారు. దీనిలో పురుషాంగం యోనిలోకి చొచ్చుకుపోయిన వెంటనే వీర్యం బయటకు వస్తుంది. దీంతో సెక్స్ లో పాల్గొనడం అంటూ జరగదు. ఈ అకాల స్ఖలనంతో ఇబ్బంది పడే పురుషులు, అతని భాగస్వామి ఇద్దరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ సమస్య వల్ల మీ భాగస్వామి మీతో బంధాన్ని తెంచుకునే అవకాశం కూడా ఉంది.
శీఘ్ర స్ఖలనానికి కారణమేంటి?
చాలా మంది పురుషులు సెక్స్ లో పాల్గొన్న ఐదు నిమిషాల తర్వాత స్ఖలనం చేస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ శీఘ్ర స్ఖలనానికి ఎన్నో కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, హస్తప్రయోగం, ఓరల్ సెక్స్, భయం, ఒత్తిడి, చిన్న వయసులోనే సెక్స్ లో పాల్గొనడం, అలసట, బాడీ టెంపరేచర్ పెరగడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుంది.
అయితే ఈ సమస్య ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ పదే పదే ఈ సమస్యతో బాధపడితే మాత్రం మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. కౌన్సిలింగ్ ఈ సమస్య నుంచి మీరు బయటపడటానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొన్ని చిట్కాలు కూడా ఈ సమస్య నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాయి.
కండోమ్ లను ధరించండి
కండోమ్ లు కూడా తొందరగా వీర్యం పడటాన్ని ఆపుతాయి. ముఖ్యంగా హైపర్ సెన్సిటీవిటీ ఉన్న పురుషులు కండోమ్ లు ధరించడం వల్ల శీఘ్ర స్ఖలనం సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఏదేమైనా గర్భం రాకుండా ఆపడానికి, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులను నివారించడానికి కండోమ్ లు బాగా ఉపయోపడతాయి.
కొద్దిసేపు గ్యాప్ ఇవ్వండి
మీరు సెక్స్ చేసేటప్పుడు లేదా హస్త ప్రయోగం సమయంలో వీర్యం బయటకు రావడానికి సిద్దంగా ఉన్నప్పుడు కొద్ది సేపు సెక్స్ ను ఆపండి. వీర్యం బయటకు వేయాలనే కోరికను ఆపడానికి మీ పురుషాంగం పైభాగాన్ని నొక్కండి. అలాగే 30 సెకన్ల పాటు వెయిట్ చేయండి. దీంతో స్ఖలనం చేయాలనే కోరిక తగ్గుతుంది. ఆ తర్వాత మీరు తిరిగి మళ్లీ సెక్స్ లో పాల్గొనొచ్చు. దీనివల్ల మీరు సెక్స్ ను మరింత ఎంజాయ్ చేస్తారు.
డిఫరెంట్ పొజీషన్స్ ను ట్రై చేయండి
కొన్ని సెక్స్ పొజీషన్స్ మిమ్మల్ని మరింత చురుగ్గా ఉంచుతాయి. ముఖ్యంగా మీరు ఎక్కువ సేపు సెక్స్ లో ఉండటానికి కొన్ని లైంగిక స్థానాలు ఉపయోగపడతాయి. అందుకే పురుషాంగంలో అత్యంత సున్నితమైన భాగాలను తక్కువగా ఉత్తేజపరిచే స్థానాలను ఎంచుకోవడానికి ప్రయత్నించండి.
కెగెల్ వ్యాయామం చేయండి
కెగెల్ వ్యాయామాలు మహిళలకు మాత్రమే కాదు.. ఇవి పురుషులలో లైంగిక కోరికలను బాగా పెంచుతాయి. ఆపుకోలేని స్థితికి చేరుస్తాయి. ఇవి లైంగిక స్థితిని మెరుగుపరుస్తాయి కూడా. ఈ కెగెల్ వ్యాయామాలు ఎప్పుడైనా, ఎక్కడైనా చేసేయొచ్చు. కెగెల్ వ్యాయామాలు చేసే ముందు మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయండి. ఈ వ్యాయామాల వల్ల కటి కండరాలు బలంగా మారతాయి.