Recipes: చల్ల చల్లని వర్షపు వేళ.. వేడి వేడి మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలంటే?
Recipes: చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా మటన్ మసాలా కర్రీ తింటుంటే ఆనందమే వేరు. ఈ స్పెషల్ కర్రీ కోసం రెస్టారెంట్లకి వెళ్ళిపోకుండా ఇంట్లోనే మనం తయారు చేద్దాం.

మటన్ మసాలా కర్రీ ఇది బిర్యానీలోకి, బగారా రైస్ లోకే కాకుండా చపాతీలలోకి, నాన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది. అలాంటి రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికి కావలసిన పదార్థాలు 1/2 కేజీ మటన్, గిల కొట్టిన పెరుగు 100 గ్రాములు.
మూడు పెద్ద ఉల్లిపాయలు, ఒక అంగుళం ముక్క అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు మూడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ చక్కెర, ఉప్పు రుచికి తగినంత.
అలాగే కాసింత కొత్తిమీర. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉల్లిపాయ మరియు అల్లం కలిపి పేస్టులా గ్రైండ్ చేయండి వెల్లుల్లిని విడిగా గ్రైండ్ చేసి అరకప్పు నీటిలో కలిపి మటన్ మీద పోసి అరగంట పాటు పక్కన పెట్టండి.
75 గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయ పేస్టు మటన్ అన్ని మసాలాలు ఉప్పు, పంచదార మరియు పెరుగు అన్ని బాగా కలియబెట్టండి. వీటన్నింటినీ కూర వండుకునే పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టండి. సన్నని సెగ మీద ముక్క ఉడికే వరకు అలాగే ఉంచండి.
దీనికి టైం పాటించకండి ఎందుకంటే లేతగా ఉండే మాంసం త్వరగా ఉడికిపోతుంది కొంచెం ముదురుగా ఉన్న మాంసం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మొక్క మెత్తబడింది లేనిది చూసుకోండి. ఆ తర్వాత మూత తీసి మటన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించాలి.
బాగా వేగింది అంటే నూనె పైకి తేలిపోతుంది. ఆ తర్వాత ఒక పది నిమిషాలు సన్నని మంట మీద ఉంచి పైన కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి అంతే అదిరిపోయే మటన్ మసాలా కర్రీ రెడీ.