కనుబొమ్మలు మందంగా, నల్లగా ఉండాలంటే ఇలా చేయండి..
కనుబొమ్మల ఆకారం ముఖ అందాన్ని పెంచుతుంది. ఫర్ఫెక్ట్ కనుబొమ్మలు దట్టంగా, నల్లగా ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలతో కనుబొమ్మలను అందంగా మార్చొచ్చు. అదెలాగంటే..

ఒక్కొక్కరి కనుబొమ్మలు ఒక్కో రంగు, పరిమాణంలో ఉంటాయి. కొందరి కనుబొమ్మలు అవసరమైన దానికంటే దట్టంగా ఉంటాయి. మరికొందరికి మరీ సన్నగా ఉంటాయి. మీ చర్మం ఎంత అందంగా ఉన్నా.. పర్ఫెక్ట్ కనుబొమ్మల ఆకారం మీ అందాన్ని మరింత పెంచుతుంది. అయితే కనుబొమ్మలను మందంగా, నల్లగా చేయడానికి చాలా మంది ఆడవారు మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ రోజంతా కనుబొమ్మలను అలాగే ఉంచడం కష్టం. కొన్ని సింపుల్ చిట్కాలతో మీ కనుబొమ్మను శాశ్వతంగా ఒత్తుగా, నల్లగా చేసుకోవచ్చు. అదెలాగంటే..
eye brows
కాఫీ పౌడర్
వంటగదిలో ఉండే కాఫీ పౌడర్ కనుబొమ్మల రంగును పెంచడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ లో 1/2 టీస్పూన్ తేనె లేదా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మీ కనుబొమ్మలపై అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. మంచి ఫలితాల కోసం రోజు తప్పించి రోజు పెట్టండి.
హెన్నా
కనుబొమ్మల రంగును పెంచడానికి మీరు హెన్నా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని అప్లై చేసేటప్పుడు కనుబొమ్మల చుట్టూ ఉన్న చర్మంపై పడకుండా చూసుకోండి. లేదంటే చర్మం ఎర్రగా మారుతుంది. మచ్చలు రాకుండా ఉండాలంటే హెన్నా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీనితో పాటు కనుబొమ్మల చుట్టుపక్కల చర్మంపై పెట్రోలియం జెల్లీని అప్లై చేయొచ్చు. నెలకొకసారి హెన్నాని వాడితే మీ కనుబొమ్మలు నల్లగా, దట్టంగా కనిపిస్తాయి.
మందార పువ్వు
మందార పువ్వును వాడితే కూడా మీ కనుబొమ్మలు నల్లగా, దట్టంగా మారుతాయి. ఈ పువ్వు పేస్ట్ ను మీ కనుబొమ్మలపై అప్లై చేసి 25 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా ఉపయోగించండి.
eye brows
కలబంద, ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో ఉండే విటమిన్ ఎ కనుబొమ్మలు పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఇ కనుబొమ్మలకు తగినంత తేమను అందిస్తుంది. ఇక కలబందలో ఉండే ఎంజైమ్లు కనుబొమ్మల వెంట్రుకలను తేమగా మార్చి, వాటి రంగును ముదురుగా, దట్టంగా మారుస్తాయి. అందుకే అలోవెరా జెల్ లో ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి రెగ్యులర్ గా పడుకునే ముందు కనుబొమ్మలకు అప్లై చేయండి. ఉదయాన్నే సాధారణ నీటితో శుభ్రం చేయండి.
ఉల్లిపాయ రసం
మందపాటి, బలమైన జుట్టు కోసం ఉల్లిపాయ రసాన్ని మనం జుట్టుకు ఉపయోగిస్తాం. అలాగే దీన్ని క్రమం తప్పకుండా కనుబొమ్మలపై అప్లై చేయడం వల్ల దట్టమైన, నల్లటి కనుబొమ్మలు మీ సొంతం అవుతాయి. రాత్రి ఆఫీసు నుంచి వచ్చి ముఖాన్ని శుభ్రంగా కడిగి ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మలపై అప్లై చేసి పడుకునే ముందు శుభ్రం చేసుకుంటే సరి.