త్వరగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గడం మాత్రం సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం మీరు తప్పకుండా బరువు తగ్గుతారు.
weightloss
అధిక బరువు అనేది నేడు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అధిక బరువు వ్యాధి కాదు. కానీ ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అధిక బరువు వల్ల ఏ పనీ చేతకాదు. చిన్న చిన్న పనులకు కూడా ఆయాసం, అలసట వస్తుంటాయి. అందుకే బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమంది ఎన్ని చేసినా బరువు మాత్రం తగ్గరు. దీనికి వీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణం.
బరువు తగ్గాలనుకునే వారు ఉదయం ఏం తినాలి? అనే డౌట్ ఎక్కువగా వస్తుంటుంది. బరువు తగ్గాలనుకునేవారు రైస్ టైప్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో బ్రౌన్ రైస్, రాగులు, బార్లీ వంటి ఆహార పదార్థాలను తింటే బరువు తగ్గుతారు. అసలు బరువు తగ్గాలనుకునేవారు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది అల్పాహారం మానేసి ఉదయం 11 గంటలకు భోజనం చేద్దామని అనుకుంటుంటారు. కానీ ఇలా అస్సలు తినకూడదు. ఎందుకంటే మన శరీరానికి అల్పాహారం చాలా ముఖ్యం. అల్పాహారం అంటే రాత్రి భోజనం తర్వాత.. అంటే 12 గంటల తర్వాత ఖాళీ కడుపుతో గడిపే సమయం. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంచడానికి అల్పాహారం చాలా అవసరం.
బరువు తగ్గేవారైనా, ఇతరులైనా బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు మానేయకూడదు. రాత్రి భోజనం తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత మనం తినే అల్పాహారం అన్ని వయసుల వారికి శక్తిని ఇస్తుంది. అందుకే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటుంటారు.శారీరకంగా చురుకుగా ఉండటానికి అల్పాహారం స్కిప్ చేయకుండా ఉండటమే మంచిది.
కొన్ని నట్స్ కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలో బాదం పప్పులు ఒక్కటి. రోజూ మీరు 5 నానబెట్టి తొక్క తీసిన బాదం పప్పులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినాలి. ఈ బాదం పప్పుల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మహిళల్లో అండాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయాన్నే నీటిలో నానబెట్టిన బాదం పప్పులను తినొచ్చు.
కొంతమందికి ప్రతిరోజూ ఉదయం కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ వీటికి బదులుగా మీరు ప్రతిరోజూ ఉదయం ఒక కప్పు వేడి నీటిని తాగాలి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. మీరు బరువు తగ్గాలే చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ మజ్జిగలో సన్నగా తరిగిన అల్లం వేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకుని తాగితే కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు.