నవరాత్రి ఉపవాసం ఉంటే బరువు తగ్గుతారా?
చాలా మంది నవరాత్రుల్లో అమ్మవారికి ఉపవాసం ఉంటుంటారు. అయితే ఈ ఉపవాసంతో కూడా సులువుగా బరువు తగ్గొచ్చు. అదెలాగంటే?
చాలా మంది ఆడవారు, మగవారు నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు. అయితే తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే కూడా మీరు సులువుగా బరువు తగ్గొచ్చు. కానీ ఈ సమయంలో కొన్ని ఆహారాలను తింటే మాత్రం మీరు బరువు తగ్గడానికి బదులుగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వేయించిన ఆహారాలను అసలే తినకూడదు.
నవరాత్రుల్లో తినే ఆహారం నిజంగా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎదుకంటే ఈ తొమ్మిది రోజుల ఉపవాస సమయంలో బియ్యం, గోధుమలతో చేసిన ఆహారాలను తినరు. వీటికి బదులుగా చిరుధాన్యాలతో పాటుగా హెల్తీ పిండిని తీసుకుంటుంటారు.
ఈ ఉపవాస సమయంలో మీరు అన్ని రకాల పండ్లను, కూరగాయలను తినొచ్చు. అలాగే నట్స్, పాలు, పనీర్ వంటి పోషకాహారాలను కూడా తింటుంటారు. ఈ నవరాత్రి ఉపవాసం బయటి ఫుడ్, ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి పూర్తిగా ఇంట్లో వండిన ఫ్రెష్ ఫుడ్ తినడాన్ని ప్రోత్సహిస్తుంది.
నవరాత్రి ఉపవాసంలో ఎందుకు బరువు పెరుగుతారు?
అతిగా తినడం
పొద్దంతా ఉపవాసం ఉండి.. దాన్ని విరమించే సమయంలో విపరీతంగా ఆకలి అవుతుంది. దీంతో అతిగా తినేస్తారు. ముఖ్యంగా నవరాత్రుల్లో తీపి వంటకాలను, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను ఎక్కువ మొత్తంలో వండి తింటుంటారు. ఈ ఆహారాల్లో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉండటం, కడుపు తొందరగా నిండకపోవడం వల్ల అతిగా తిని విపరీతంగా బరువు పెరుగుతారు.
డీహైడ్రేషన్
చాలా మంది ఉపవాసంలో నీళ్లను కూడా తాగకుండా ఉంటారు. కానీ ఇది మీ ఆకలిని పెంచుతుంది. అలాగే మీరు తినే ఆహారంలో కేలరీలు పెరిగేలా చేస్తుంది. ఈ రెండింటి వల్ల మీరు ఉపవాసం ఉన్నా బరువు పెరుగుతారు. ఎవ్వరైనా సరే ఉపవాసం చేసేటప్పుడు హైడ్రేట్ గా ఉండాలి. ఇందుకోసం నీళ్లను పుష్కలంగా తాగాలి. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. పెరిగిన డీహైడ్రేషన్ మీరు బరువు పెరిగేలా చేస్తుందని వెల్లడించింది.
ఎక్కువ కేలరీల పానీయాలు తీసుకోవడం
ఉపవాసం ఉండటం మామూలు విషయం కాదు. అందుకే చాలా మంది నవరాత్రుల సమయంలో తీయని పండ్ల రసాలను, చక్కెర లాసిన్, మిల్క్ షేక్స్ వంటి పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఈ తీపి పానీయాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువ మొత్తంలో తాగితే మీరు పక్కాగా బరువు పెరుగుతారు.
=
నవరాత్రి ఉపవాసంలో బరువు తగ్గడం ఎలా?
చిన్న భోజనం చేయాలి
ఉపవాసం విరమించినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా. బదులుగా కొంచెం కొంచెం తరచుగా తినండి. దీనివల్ల మీరు అతిగా తినకుండా ఉంటారు. బరువు పెరగకుండా ఉంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తక్కువ మొత్తం తరచుగా తింటే బరువు పెరిగే అవకాశం ఉండదు.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం
నవరాత్రి ఉపవాసంలో పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినండి. ఈ సమయంలో బరువు తగ్గడానికి ఇదే సీక్రేట్. బరువు ఈ ఉపవాసంలో బరువు తగ్గాలంటే మాత్రం మీరు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
ఇది మీ కడుపును తొందరగా నింపుతుంది. ఎక్కువ ఆకలి కానీయదు. అందుకే ఈ సమయంలో రకరకాల పండ్లను, కూరగాయలను పుష్కలంగా తినండి. ఫైబర్ మీరు సులువుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వాటర్, ఇతర హెల్తీ పానీయాలు
ఉపవాసం సమయంలో కూడా నీళ్లను పుష్కలంగా తాగొచ్చు. వాటర్ మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఒకవేళ మీరు డీహైడ్రేట్ అయితే గనుక మీరు ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినే అవకాశం ఉంటుంది.
కాబట్టి హైడ్రేట్ గా ఉండటానికి నీళ్లతో పాటుగా ఇతర హెల్తీ డ్రింక్స్ ను తాగండి. లేత కొబ్బరి నీళ్లు, ఇంఫ్యూజ్డ్ వాటర్, నిమ్మరసం, మజ్జిగ వంటి పానీయాలను తాగితే మీరు హైడ్రేట్ గా ఆరోగ్యంగా ఉంటారు.
సరైన మార్గంలో ఉడికించాలి
నవరాత్రి ఉపవాసం ఉండేవారు ఏ వంటను చేసినా దానిని సరిగ్గా ఉడికించి తినాలి. ఈ సమయంలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను అస్సలు తినకూడదు. ఉడికించి తింటే మీరు కొవ్వు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం
బరువు తగ్గాలంటే మీరు తినే ఆహారం ఆరోగ్యకమైనదై ఉండాలి. అంటే వేయించిన పకోడీలు లేదా కేలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్ ను అస్సలు తినకూడదు. పోషకాలు పుష్కలంగా ఉండే మాఖానా రోస్ట్, ఉడకబెట్టిన శనగ సలాడ్, బెర్రీలతో పెరుగు, పెసర మొలకల సలాడ్, లస్సీ, గింజలను ఎంచక్కా తినొచ్చు. వీటిలో మీరు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నవరాత్రుల్లో వీటిని తింటే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు.
వ్యాయామం
ఉవవాసం ఉన్నవారు కూడా ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అంటే మీరు హెవీ వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్, యోగా వంటి ఇంట్లో చేసే తేలికపాటి వ్యాయామాలను చేసినా మీరు బరువు తగ్గుతారు. ఇవి కేలరీలను కరిగించి మీ జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.
నవరాత్రి ఉపవాసం సమయంలో తినకూడని ఆహారాలు
మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదు. అంటే పూరీ, వడలు, పకోడీలు, వేయించిన బంగాళాదుంపలు మొదలైన ఆహారాలను తినకూడదు. అలాగే చక్కెరతో చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. చిప్స్ వంటి ప్యాక్ చేసిన స్నాక్స్ ను కూడా తినకూడదు.
అలాగే ఆలుగడ్డలు, టాపియోకా వంటి పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తక్కువ మొత్తంలో తినాలి. అలాగే బిస్కెట్లు, చిప్స్, పేస్ట్రీలు వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ను అస్సలే తినకూడదు. ఎందుకంటే ఇవి మీరు బరువు పెరిగేలా చేస్తాయి.