ఒక వారంలో బరువు తగ్గడం ఎలా?
బరువు తగ్గడం చాలా కష్టమైన పని అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ప్రయత్నిస్తే మీరు వారంలో కూడా బరువు చాలా ఈజీగా తగ్గొచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంట్లో ఏ పనిచేయకుండా తిని ఉంటే.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల మీ బరువు విపరీతంగా పెరిగిపోతుంది. శరీర బరువు పెరగడం వల్ల నచ్చిన దుస్తులను వేసుకోలేరు. అలాగే ఏ పనీ చేయడానికి కూడా చేతకాదు. చిన్న పనిచేసినా ఆయాసం వస్తుంది. నిజానికి బరువు పెరగడం ఆరోగ్యానికి అంత మంచి విషయం కాదు. ఎందుకంటే ఇది లేనిపోని రోగాలు వచ్చేలా చేస్తుంది. అందుకే వారం రోజుల్లో బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నీళ్లు తాగాలి
మన శరీరానికి నీళ్లు చాలా చాలా అవసరం. మన శరీరంలో నీరే ఎక్కువ భాగం ఉంటుంది. నీళ్లు మనం హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లను పుష్కలంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి నీళ్లు మీరు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. హైడ్రేట్ గా ఉంటే ఆకలి చాలా వరకు తగ్గిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. దీంతో కొవ్వులు కరగడం మొదలవుతుంది.
ద్రవ ఆహారం
ఒక వారంలో బరువు తగ్గాలనుకుంటే ద్రవాహారం తీసుకోవాలి. అంటే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తాగండి. బరువు తగ్గడానికి ద్రవ ఆహారం చాలా సహాయపడుతుంది. ఇది మీ ఆకలిని చాలా వరకు తగ్గిస్తుంది.
కార్బోహైడ్రేట్లకు బై
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వారం రోజుల్లో మీరు బరువు తగ్గాలనుకుంటే కార్బోహైడ్రేట్లను అస్సలు తినకండి. ఎందుకంటే ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. మీ రోజువారి ఆహారం నుంచి రోజుకు 500 నుంచి 750 కేలరీలను తగ్గించండి.
weight loss
డైట్ ప్రోటీన్
ప్రోటీన్లు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఉండే ఆహారం ఫుడ్ కోరికలను చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే వీటిని తింటే మీకు ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. ఇది మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
పండ్లు, ఉడికించిన కూరగాయలు
బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన కూరగాయలు, సూప్, చీజ్, చికెన్, గుడ్లు, మజ్జిగను తప్పకుండా చేర్చండి. సూప్ లు, ఉడికించిన కూరగాయలను తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి ఉండదు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వ్యాయామం
కేవలం ఒక వారం రోజుల్లో మీరు బరువు తగ్గాలనుకుంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయండి. ఇందుకోసం రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామం చేయండి. 30 నిమిషాల పాటు పరిగెత్తడం లేదా వ్యాయామం చేయడం వల్ల 500 కేలరీలు బర్న్ అవుతాయి.
weight loss
యోగా చేయండి
వేగంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం రోజూ ఒకటి నుంచి రెండు గంటల పాటు యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి రోజూ సూర్యనమస్కారాలు, ధనురాసనం, ఉత్కటాసనం వంటి యోగాసనాలు చేయొచ్చు.