నల్లని పెదాలు ఎర్రగా మారాలంటే ఇలా చేయండి..
మీరెంత అందంగా రెడీ అయినా.. పెదాలు నల్లగా ఉంటే మాత్రం ఏదో లోపం ఉన్నట్టుగానే కనిపిస్తారు. మరి నల్లని పెదాలు ఎర్రగా అందంగా మారాలంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

రకరకాల కారణాల వల్ల పెదాలు నల్లగా మారిపోతూ ఉంటాయి. మరి నల్లని పెదాలు ఎర్రగా మారేందుకు మీకు ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్మోకింగ్.. సిగరేట్ కాల్చడం వల్ల కూడా పెదాలు నల్లగా మారుతుంటాయి. ఎందుకంటే సిగరేట్ లో ఉంటే టార్ లిప్స్ ను నల్లగా చేస్తుంది. కాబట్టి స్మోకింగ్ కు దూరంగా ఉండండి..
లిప్ స్టిక్స్.. మీకు తెలుసా.. పెదాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి మీరు వాడే లిప్ బామ్స్, కొన్ని రకాల లిప్ స్టిక్స్ వల్ల కూడా పెదాలు నల్లగా మారుతాయి. కాబట్టి కెమికల్స్ మిక్స్ చేసిన లిప్ స్టిక్స్ కు దూరంగా ఉండండి. కావాలంటే సహజ లిప్ స్టిక్స్ ను పెట్టుకోవచ్చు.
టీ, కాఫీ లు.. టీ, కాఫీలు తాగడం వల్ల కూడా కొంతమందికి పెదాలు నల్లగా అవుతాయి. ఈ సమస్య ఉన్న వాళ్లు టీ, కాఫీలకు బదులుగా లెమన్ టీ, గ్రీన్ టీను తాగడం మంచిది.
హైడ్రేటెడ్ గా.. పెదాలు ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేట్టు చూసుకోవాలి. పెదాలు తేమగా ఉంటేనే అవి లేత గులాబీ రంగులోకి మారతాయి.
విటమిన్ సి.. మన శరీరానికి విటమిన్ సి ఎంతో అవసరం. విటమిన్ సి లోపిస్తే కూడా పెదాలు నల్లగా మారుతుంటాయి. విటమిన్ సి లభించాలంటే సిట్రస్ ఫ్రూట్స్ అయినా.. నిమ్మ, దానిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి.
హనీ అండ్ లెమన్.. నల్లగా ఉన్న పెదాలు తెల్లగా మారాలంటే.. నిమ్మరసంలో తేనెను మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే నల్లగా ఉండే పెదాలు కొన్ని రోజుల్లోనే ఎర్రగా మారిపోతాయి.
కెమికల్ ఫ్రీ.. లిప్స్ కు వాడే ప్రొడక్ట్స్ లల్లో కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. సహజమైనవే వాడండి. ఎందుకంటే కెమికల్స్ ఉన్న వాటిని వాటడం వల్ల కూడా పెదాలు నల్లగా మారడమే కాదు వాటి అందం కూడా పాడవుతుంది.