ఏం చేస్తే వంటింట్లోకి దోమలు, ఈగలు, పురుగులు రాకుండా ఉంటాయి?
వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడ చూసినా ఈగలు, దోమలు, పురుగులే కనిపిస్తాయి. దీనివల్ల చిరాకు పుట్టడమే కాకుండా.. మనల్ని ఎన్నో రోగాల బారిన కూడా పడేస్తాయి. అందుకే వర్షాకాలంలో వంటింట్లోకి ఈగలు, దోమలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్ మొత్తం ప్రతిరోజూ వానలు పడుతూనే ఉంటాయి. కానీ ఈ కాలంలో వంటింట్లోకి దోమలు, ఈగలు, పురుగులతో పాటుగా కీటకాలు ఒక్కటే వస్తాయి. దీంతో ఇల్లంతా దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా వంటగదిలో దోమలు, ఈగలు, కీటకాలు దుర్వాసను కలిగించి మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చేలా చేస్తాయి. అందులోనూ ఏం చేసినా కూడా ఈ ఈగలు, దోమలు బయటకు పోనే పోవు. కానీ మీరు ఓపికతో కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే గనుక ఇంట్లోకి చీమలు, ఈగలు, దోమలు, ఇతర కీటకాలు రాకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వీటిని వంటగదిలో ఉంచండి
కొన్ని వస్తువులను వంటింట్లో ఉంచితే కూడా వంటింట్లోకి చీమలు, దోమలు, ఈగలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందుకోసం కిచెన్ లో ఉండే కిటికీ దగ్గర తులసి, పుదీనా, నిమ్మకాయలను ఉంచాలి. అలాగే లావెండర్, యూకలిప్టస్ నూనెను కిటికీ దగ్గర ఉంచితే కూడా దోమలు, ఈగలు రావు. ఎందుకంటే వీటి వాసన ఈగలకు, దోమలకు నచ్చదు.
వెనిగర్, డిష్ వాషింగ్ డిటర్జెంట్
వెనిగర్, డిష్ వాషింగ్ డిటర్జెంట్ తో కూడా మీరు ఇంట్లోకి దోమలు, ఈగలు, ఇతర కీటకాలు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక పెద్ద గ్లాసులో సబ్బు, వెనిగర్ వేయండి. దీనికి ప్లాస్టిక్ మూత పెట్టి.. దానికి చినన రంధ్రం చేసి దోమలు, ఈగలు ఎక్కువగా ఉండే దగ్గర పెట్టండి.
వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
వంటిళ్లు శుభ్రంగా లేకపోయినా కూడా ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే మీ వంట రూం ను శుభ్రంగా ఉంచుకోండి. అలాగే వంటింట్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు కట్ చేసి వాటిపై మూతలు పెట్టాలి. అలాగే కూరగాయలు, పండ్ల చెత్తాను చెత్త డబ్బాలో వేసి మూత ఖచ్చితంగా పెట్టాలి.
పైప్ లీకేజీలపై జాగ్రత్త
వంటింట్లో పైపులు లీక్ అయ్యాయేమో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా సింక్ పైపు. పైపులు లీకవ్వకుండా ఉండాలంటే వాటిని తరచుగా కడుగుతూ ఉండాలి. టబ్ అడుగున నీటి లీకేజీలను సరిచేయాలి. అలాగే వంటింటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
పండ్లు, కూరగాయలు
చాలా మంది పండ్లు, కూరగాయలను అలాగే ఓపెన్ గా ఉంచుతారు. వీటిని కప్పి ఉంచరు. కానీ పండ్లను, కూరగాయలను అలాగే ఓపెన్ గా ఉంచితే వాటిమీద ఈగలు, కీటకాలు వాలే అవకాశం ఉంది. అందుకే పండ్లు, కూరగాయలపై ఏదో ఒకటి కప్పండి.
kitchen tips 01
పాత్రలను వెంటనే శుభ్రం చేయండి
చాలా మందికి ఉపయోగించిన, తిన్న పాత్రలను శుభ్రం చేసే అలవాటు అస్సలు ఉండదు. కానీ వీటిని ఎక్కువసేపు సింక్ లో ఉంచితే సూక్ష్మక్రిములు వాటికి పేరుకుపోతాయి. ఈగలు, కీటకాలు కూడా మీ ఇంట్లోకి దారులు కడతాయి.