టాయిలెట్ సీటు కంపు వాసన పోవాలంటే ఏం చేయాలి?
టాయిలెట్ సీటు నుంచి వచ్చే కంపు వాసనను భరించడం చాలా కష్టం. ఈ వాసనను పోగొట్టడానికి ఏవేవో వాడుతుంటారు. అయినా అప్పటికప్పుడు ఈ దుర్వాసన మాత్రం పోదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో టాయిలెట్ సీటు కంపును పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టాయిలెట్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే దాన్నుంచి దుర్వాసన వస్తుంది. ఈ కంపు వాసనతో అందులోకి వెళ్లాలనిపించదు. అయినా తప్పదు. దీనివల్ల శ్వాస కూడా పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ కంపు వాసనను పోగొట్టడానికి చాలా మంది మార్కెట్లో దొరికే ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది నాఫ్తలీన్ మాత్రలను కూడా ఉపయోగిస్తారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే టాయిలెట్ సీటు నుంచి కంపు వాసనను పోగొట్టొచ్చు. అదెలాగో తెలుసుకుందాం పదండి.
అగ్గిపుల్లలతో టాయిలెట్ వాసనను ఎలా పోగొట్టాలి?
అగ్గిపుల్లలలో కూడా టాయిలెట్ సీటు నుంచి వచ్చే కంపు వాసనను పోగొట్టొచ్చు. ఇందుకోసం ముందుగా అగ్గిపుల్లలను వెలిగించి కాసేపు కాల్చండి. తర్వాత ఈ వెలిగించిన అగ్గిపుల్లలను టాయిలెట్ సీటు కింద లేదా సింక్ దగ్గర ఉంచండి.మండుతున్న అగ్గిపెట్టె నుంచి వచ్చే పొగ దుర్వాసనను గ్రహిస్తుంది. ఇలా కాల్చిన అగ్గిపుల్లలను వాడండి.
అగ్గిపుల్లలు
మరుగుదొడ్డి వాసనను తొలగించడానికి మీరు ముందుగా ఉపయోగించిన కొన్ని అగ్గిపుల్లలను సేకరించండి. అగ్గిపుల్లల ముందుభాగంలో ఉన్న దాన్నుంచి పౌడర్ తయారుచేయండి. ఈ పొడిని టాయిలెట్ ఫ్లోర్ మీద చల్లి తర్వాత ఫ్లష్ చేయండి. అగ్గిపుల్ల పొడి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.
కర్పూరంతో టాయిలెట్ వాసనను ఎలా పోగొట్టాలి ?
కొన్ని కర్పూరం ముక్కలను తీసుకుని టాయిలెట్ మూలన ఉంచండి. కర్పూరం బలమైన వాసన అక్కడి మురికి వాసన లేకుండా చేస్తుంది. కర్పూరం నీళ్లు కూడా టాయిలెట్ వాసనను పోగొట్టడానికి ఉపయోగపడతాయి.
టాయిలెట్ వాసనను వదిలించుకోవడానికి కర్పూరం నీరు
దీని కోసం ఒక చిన్న పాత్రలో నీటిని మరిగించండి. దీనిలో కొద్దిగా కర్పూరం కలపండి. ఇప్పుడు ఈ నీటిని టాయిలెట్ లో పోసి కాసేపు అలాగే ఉంచండి. కాసేపటి తర్వాత ఫ్లష్ చేయండి. కర్పూరం నీరు చెడు వాసనను తొలగించడానికి, మరుగుదొడ్డిని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఇవి గుర్తుంచుకోండి
ఈ హ్యాక్ లను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా అగ్గిపెట్టెలను కాల్చండి. కర్పూరాన్ని ముక్కు లేదా నోటి దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది చికాకు కలిగిస్తుంది.