వంటింట్లో చీమల బెడదా..? పప్పు, బియ్యం తినేస్తున్నాయా? ఇదిగో పరిష్కారం..!
వంట గదిలోకి, ముఖ్యంగా బియ్యం, పప్పు డబ్బాల్లోకి చేరుతాయి ఉంటాయి. మరి... వీటిని ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Red ants in house
వర్షాకాలంలో ఎక్కువ మంది చీమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే... వర్షాకాలంలో వానలు కురిసి.. మట్టి తడవడంతో.... చీమలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అలా బయటకు వచ్చిన చీమలన్నీ మళ్లీ చీకటి, చల్లని ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడతాయి. ఈ క్రమంలోనే.. వంట గదిలోకి, ముఖ్యంగా బియ్యం, పప్పు డబ్బాల్లోకి చేరుతాయి ఉంటాయి. మరి... వీటిని ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ants general
కిచెన్ లోకి చీమలు అడుగుపెట్టడం ఆలస్యం ముందుగా.. బియ్యం, పప్పులనే టార్గెట్ చేస్తాయి. ఎందకంటే.. ఇవి వాటికి రుచికి తియ్యగా ఉండటంతో పాటు... చల్లగా ఉంటాయి. అందుకే..వాటిని తినడం మొదలుపెట్టేస్తాయి. అందుకే.. ఈ రెండింటినీ ఆ చీమల బారి నుంచి కాపాడటానికి.. కొన్ని చిట్కాలు వాడితే చాలు.
ants
బోరిక్ పౌడర్, లవంగాలు ఉపయోగించి ఈ చీమలను తరిమి కొట్టవచ్చు. బియ్యం, పప్పులకు మీరు బోరిక్ పౌడర్ వేసి బాగా కలపాలి. దానితో.. పాటు వీటిలో కొన్ని లవంగాలు కూడా వేయాలి. తర్వాత.. మూత పెడితే సరిపోతుంది. ఈ రెండింటి వాసనకు చీమలు చాలా ఈజీగా పారిపోతాయి. తిరిగి అన్నం, పప్పులను మనం వాడుకునే సమయంలో... నీటితో ఎక్కువ సార్లు కడగడం మంచిది.
ఇక. .. కిచెన్ ప్లాట్ ఫామ్ పై తిరుగుతున్న చీమలను ఎలా వదిలించుకోవాలి అంటే... దీని కోసం మీరు వెనిగర్ ని వాడొచ్చు. చీమలు తిరిగే ప్రదేశంలో మీరు వెనిగర్ చల్లి..దానితో క్లీన్ చేయవచ్చు. వెనిగర్ పులుపుకు చీమలుపారిపోతాయి.
bullet ants
ఉప్పు నీటితో చీమలను తరిమికొట్టండి సింక్ దగ్గర నీరు కారడం వల్ల చీమలు చాలా చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఈ చీమలను వదిలించుకోవడానికి, సింక్ చుట్టూ ఉప్పు చల్లి, ఇంట్లో నుండి చీమలను తరిమికొట్టండి. ఇది కాకుండా మీరు ఉప్పునీరు కూడా చల్లుకోవచ్చు.
గోడపై నడిచే చీమలను ఎలా వదిలించుకోవాలి
గోడలపై చీమలు పాకుతున్నట్లయితే, స్ప్రే బాటిల్లో 2-3 చెంచాల డెటాల్ , కర్పూరం కలపండి. స్ప్రే బాటిల్లో కర్పూరం, డెటాల్, నీళ్లు పోసి గోడలపై స్ప్రే చేయాలి. అంతే.. చీమలు పారిపోవడం ఖాయం.