సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలో తెలుసా?
ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. మీరు సోషల్ మీడియా స్టార్ అయిపోవచ్చు. మీ వీడియోలు కూడా వైరల్ అవుతాయి. మీరు కూడా లక్షల్లో డబ్బు కూడా సంపాదించవచ్చు. మరి దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎకౌంట్ లేనివాళ్లు ఎవరూ లేరు. మరీ ముఖ్యంగా ఈ కాలం యువత ఇన్ స్టాగ్రామ్ ని విపరీతంగా వాడేస్తున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో సెలబ్రెటీలు గా మారినవారు చాలా మంది ఉన్నారు. అయితే... ఇక్కడ ఫాలోవర్స్ ని పెంచుకోవడం, వేలల్లో వ్యూస్ సంపాదించడం అంత సులువైన పనేమీ కాదు. అందరూ ఫేమస్ అయిపోతున్నారు.. మేం మాత్రం ఎంత కష్టపడినా మాకు వ్యూస్ రావడం లేదు.. ఫాలోవర్స్ కూడా పెరగడం లేదు అని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు.
ఈ జాబితాలో మీరు కూడా ఉన్నారా..? ఫాలోవర్స్ ని ఎలా పెంచుకోవాలో అర్థం కావడం లేదా..? అయితే.. ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. మీరు సోషల్ మీడియా స్టార్ అయిపోవచ్చు. మీ వీడియోలు కూడా వైరల్ అవుతాయి. మీరు కూడా లక్షల్లో డబ్బు కూడా సంపాదించవచ్చు. మరి దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
Follow these tricks to increase Instagram followers
మీరు మీ ఫాలోవర్స్, వ్యూస్ రెండింటినీ పెంచుకోవాలనుకుంటే, మీరు మంచి నాణ్యత గల వీడియోలను రూపొందించాలి. అలాగే, వీడియో ఎవరైనా చూడటం ప్రారంభించిన తర్వాత, యూజర్స్ ని ఆకట్టుకునేలా మీ కంటెంట్ ఉండాలి. అంటే వినియోగదారులు మీ కంటెంట్‌ను ఇష్టపడాలి, అప్పుడే మీ ఫాలోవర్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. అదనంగా, అధిక నాణ్యత గల వీడియోలతో పాటు వినోదభరితమైన, ఫన్నీ కంటెంట్‌ను ఉపయోగించండి.
ఇన్‌స్టాగ్రామ్‌లో 100K పెంచడానికి, వీడియోలను పోస్ట్ చేసేటప్పుడు మీరు కీలకపదాలపై శ్రద్ధ వహించడం ముఖ్యం.
మీ ప్రొఫైల్ వివరణను బలంగా చేయండి.
మీ కంటెంట్ ఆసక్తికరంగా ఉన్నప్పుడే మీరు వీడియోలపై మంచి వీక్షణలను పొందుతారు.
ఇది కాకుండా, 100K వీక్షణలను పెంచడానికి మీరు ట్రెండింగ్ టాపిక్‌లను ఎంచుకోవాలి.
ఉచితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మీ పరిధిని పెంచుకోవడానికి, మీరు హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మరిన్ని వీక్షణలను పొందడానికి, నిరంతరంగా , నిర్ణీత సమయంలో వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండండి.
మీ Instagram ఖాతాను ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు లింక్ చేయండి.
లాంగ్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉండాలి. పోస్ట్ చేసిన మొదటి వీడియోకే మీరు ఫేమస్ అయిపోరు. కాబట్టి కాస్త ఓపికగా ఉండాలి. ఒక్కోసారి వ్యూస్ రాకపోయినా వీడియోలు పోస్టు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఏదో ఒకటి వైరల్ అవతుంది. అప్పటి వరకు నిరుత్సాహ పడకుండా ఉండాలి. ఒక్క వీడియో క్లిక్ అయితే.. తర్వాత మిగిలినవన్నీ కూడా వ్యూస్ పెరుగుతాయి. ఫాలోవర్స్ కూడా పెరిగిపోతారు. మంచి కంటెంట్ మాత్రమే ఇవ్వాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్తపడాలి.