సోషల్ మీడియాలో వీటిని అస్సలు షేర్ చేయకూడదు.. ఒకవేళ చేశారో..?
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఇక పర్సనల్ విషయాలను కూడా కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ ప్రొఫేషనల్ కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తే..
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, ఇతరుల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఒక గొప్ప వేదిక. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చాలా మంది తమకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను, ఇతర పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే.. జస్ట్ ఒక్క సోషల్ మీడియాతో ఒక వ్యక్తి గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. కొంతమంది అయితే ఏ సమయంలో ఎలాంటి మూడ్ లో ఉన్నారో కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం తప్పేం కాదు. కానీ సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇది కూడా మీకు ముప్పే. మిమ్మల్ని ఎన్నో సమస్యల్లోకి తోసేయగలదు మరి. చాలాసార్లు మనకు తెలియకుండానే మనల్ని చిక్కుల్లోకి తోసే కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఇది మన కెరీర్, ప్రొఫెషనల్ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సోషల్ మీడియాలో షేర్ చేయకూడని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వర్క్ ఫోటో
ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా మనలో చాలా మంది ఫోటోలను తీసుకుంటుంటారు. అయితే వీటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీరు ఇలాగే ఆఫీసులో ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే.. మీరు పనికి బదులు ఫోటోలు తీస్తున్నారని ఇతరులు అనుకుంటారు. అలాగే మీకు పనిమీద ధ్యాసే లేదని భావిస్తారు. అంతేకాదు ఆఫీసులో కూడా మీరు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారనే మెసేజ్ వస్తుంది. మీరు చేసిన ఈ చిన్న పొరపాటు తర్వాత మీకు పెద్ద ప్రమాదాన్నే తీసుకురావొచ్చు.
నెగెటివ్ రివ్యూ
సోషల్ మీడియాలో మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా.. ఆ కంపెనీపైనా నెగెటివ్ రివ్యూలను అస్సలు పోస్ట్ చేయకూడదు. ఇది మీ ప్రొఫెషనల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది. కానీ మనం దీనిపై దృష్టి పెట్టం. కానీ మీరు మీరు పనిచేసే కంపెనీ గురించి నెగిటీవ్ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే సంస్థకు మీపై నెగిటీవ్ ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మీరు ఎన్నో అవకాశాలను కోల్పోవచ్చు.
కంపెనీ సీక్రెట్స్
ప్రతి కంపెనీకి దాని స్వంత పని విధానమంటూ ఒకటి ఉంటుంది. సాధారణంగా కంపెనీలు తమ ఫార్ములాలు, సీక్రెట్స్ ను ఎవరికీ చెప్పవు. ఈ విషయం ఒక్క కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఈ కంపెనీల్లో జాబ్ మానేసి అంటే.. ఏదో విషయంలో గొడవ జరిగి వేరే కంపెనీల్లోకి వెళ్లిన కొంతమంది.. ఆ కంపెనీ రహస్యాలను సోషల్ మీడియాతో పంచుకుంటుంటారు. కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు. మీరు కంపెనీలో ఉన్నా, ఉద్యోగం మానేసినా పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి. ఎందుకంటే ఇది మీ ప్రొఫెషనల్ ఇమేజ్, విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ఆ కంపెనీ గురించి చెప్పిన మీరు ఈ కంపెనీ గురించి కూడా ఎందుకు చెప్పరన్న అనుమానం ఇతరులకు వస్తుంది. ఇది మీకు జాబ్ లేకుండా చేయొచ్చు.
ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం
మనలో చాలా మంది మన జీవితానికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్నికూడా సోషల్ మీడియాలో పంచుకుంటాం. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ సమాచారాన్ని పంచుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇధి మిమ్మల్ని అన్ ప్రొఫెషనల్ గా కనిపించేలా చేస్తుంది. మీ వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యల గురించి మీరు సోషల్ మీడియాలో వెల్లడించిన అవసరం లేదు. ఆఫీసులో ఇమేజ్ మెయింటైన్ చేసినట్లే మీ ఆన్లైన్ ఉనికి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.