పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొంటే ఏమౌతుందో తెలుసా..?
పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనవచ్చా లేదా అనేది ఒక డిబేట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. అయితే పెళ్లికి ముందు కూడా సెక్స్ లో పాల్గొనే వారు చాలా మందే ఉన్నారు. ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లికి ముందు సెక్స్ చేయడాన్ని కొందరు తప్పేంలేదు.. ఇది సరైనదే అని అంటే .. మరికొంతమంది చీ.. ఇదే పాడు బుద్ది.. ఇది పెద్దతప్పు అంటూ ఎవరికి తోచింది వారు చెబుతూ ఉంటారు. నిజానికి పెళ్లికి ముందు సెక్స్ చేయడం వల్ల కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి వివాహానికి ముందే సెక్స్ చేయడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో మొదటగా తెలుసుకుందాం పదండి..
ఎక్స్ పీరియన్స్: పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా విషయాలను తెలుసుకుంటారు. అసలు సెక్స్ అంటే ఏమిటి? ఇది ఎలా ఉంటది? వంటి అనేక విషయాల గురించి పూర్తి అవగాహనకు వస్తారట. వీటి ద్వారా వారు ఎలా ఇష్టపడతారు అనే విషయం కూడా తెలుస్తుందట. ముఖ్యంగా దీనివల్ల ఇలాంటి విషయాల్లో సిగ్గు, బిడియం వంటివి కలగవట. అంతేకాదు మీ పార్టనర్ తో ఫ్రీగా మాట్లాడగలుగుతారట. అలాగే మీకు మీ మీద గట్టి నమ్మకం కూడా ఏర్పడుతుందట
అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు: పెళ్లికి ముందే మీరు మీ పార్టనర్ తో సెక్స్ చేయడం వల్ల.. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే వారితో అడ్జస్ట్ అయ్యి బతకాల్సిన పనిలేదట. కాగా పెళ్లి తర్వాత సెక్స్ చేయడం వల్ల వారు నచ్చకపోయినా.. వారితో మీరు బతికున్నంత కాలం జీవించాల్సి వస్తది. వారితో మీరు సాటిస్ఫై కాకున్నా చచ్చినట్టు బతకాల్సిందే. అదే పెళ్లికి ముందైతే అలా కాదు .
ఒత్తిడి: ఒత్తిడిని తగ్గించడంలో సెక్స్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా పెళ్లికి ముందే సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుందట. అందుకే చాలా మంది పెళ్లికి ముందే సెక్స్ పట్ల ఆసక్తి చూపుతుంటారు.
సమస్యలు: వివాహానికి ముందుగానే సెక్స్ లో పాల్గొనడం వల్ల దానిపట్ల వారికున్న సమస్యలేంటో తెలుసుకోగలుగుతారు. అంతేకాదు.. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి డాక్టర్లను సంప్రదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పెళ్లి తర్వాత మీకు సమస్య ఉందని తెలిస్తే.. మీ వల్ల వచ్చిన అమ్మాయి అకారణంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్లికి ముందుకు సెక్స్ చేయడం వల్ల ఇన్ని విషయాలను క్లారిటీ పొందవచ్చు.
నష్టాలు: పెళ్లికి ముందే సెక్స్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి పెళ్లికి ముందే సెక్స్ చేయడం వల్ల లాభాల సంగతి పక్కన పెడితే నష్టాలు ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆసక్తి తగ్గుతుంది: తరచుగా సెక్స్ చేయడం వల్ల సెక్స్ పై ఉన్న ఆసక్తి తగ్గుతుందట. అయితే పెళ్లికి ముందే సెక్స్ చేసే వారికి పెళ్లితర్వాత దానిపై ఆసక్తి తగ్గే అవకాశముందని కొందరు భావిస్తున్నారు.ఈ కారణంగా మీ పార్టనర్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రెగ్నెన్సీ: పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో అమ్మాయిల లైఫ్ రిస్క్ లోకి వెళ్లినట్టే. ఇదివారికి అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది.
ఎస్టీడీ: పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొనడం మూలంగా కొంతమందికి సెక్సువల్లీ ట్రాన్స్మిటడ్ డిసీజెస్ వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఫ్యూచర్ లో ఎన్నో సమస్యలను తెస్తుంది. కాబట్టి పెళ్లికి ముందు సెక్స్ కు దూరంగా ఉండటమే ఉత్తమం.