హోటల్ రూమ్‌లో హిడెన్ కెమెరాలను ఎలా కనిపెట్టాలో తెలుసా?
మీరు తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? అక్కడ హోటల్స్ కి వెళ్లి రూమ్స్ బుక్ చేసుకుంటారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా చోట్ల హిడెన్ కెమెరాలు పెట్టి ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా బాత్ రూం, బెడ్ రూంలలో కెమెరాలు పెట్టి వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఉన్న రూమ్ లో హిడెన్ కెమెరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ టెక్నిక్ పాటించి హిడెన్ కెమెరాలను కనిపెట్టండి. సురక్షితంగా ఉండండి.
బిజినెస్ ఓనర్లు, మార్కెటింగ్ చేసే వాళ్లు తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వారి వ్యాపారాలు పెంచుకోవడానికి, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అనేక ఊర్లు తిరగాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఫ్రెష్ అవడానికి, రిలాక్స్, రెస్ట్ తీసుకోవడానికి రూమ్ తీసుకోవడం తప్పనిసరి. హోటల్ యాజమాన్యాలు ఇచ్చే భరోసాలను నమ్మి రూమ్స్ తీసుకోవడం చాలా రిస్క్ తో కూడుకున్న పనే. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండక తప్పదు. ముఖ్యంగా వర్కింగ్ ఒమెన్, కపుల్స్ జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల క్రికెటర్ విరాట్ కొహ్లీ, ఆయన భార్య అనుష్క కలిసి వెళ్లిన పేమస్ హోటల్ లోనే హిడెన్ కెమెరాను వారు గుర్తించారు. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఓయో గదులను ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా యువత ఉపయోగిస్తున్నారు. ఓయో సంస్థ 2012 లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. ప్రస్తుతం, ఈ సంస్థ 80 దేశాల్లో 800 కి పైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఓయో గదులు చాలా హోటళ్లతో పోలిస్తే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఓయో గదులు సురక్షితమైనవని నమ్మకం ఉండటం వల్ల ప్రజలు వాటిని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన హోటళ్లలో మొత్తం 10 లక్షలకు పైగా గదులు ఉన్నాయి.
మీరు హోటళ్లకు వెళ్ళినప్పుడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి మీ దగ్గర ఏదైనా గుర్తింపు కార్డు అడిగితే మీ అసలు ఆధార్ కార్డును ఎప్పుడూ చూపించకండి. ఎందుకంటే ఆధార్ కార్డులో చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుంది. మీ పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా అవన్నీ వారికి సమర్పించినట్లు అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంకుతో లింకై ఉంటుంది. దీని ద్వారా వారు మీ చిరునామా, బయోమెట్రిక్స్ తీసుకొని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి.
హోటల్ రిసెప్షన్లో కూర్చున్న వ్యక్తికి అసలు ఆధార్ కార్డు ఇవ్వడానికి బదులుగా మాస్క్డ్ ఆధార్ కార్డు ఇవ్వండి. మాస్క్డ్ ఆధార్ కార్డును మన గుర్తింపు కోసం ఉపయోగించవచ్చు. ఇందులో ఆధార్ కార్డులోని మొదటి 8 అంకెలు కనిపించవు. చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్ నంబర్‌ను దాచి ఉంచడం ద్వారా మీ వ్యక్తిగత వివరాలు సురక్షితంగా ఉంటాయి.
సాధారణంగా హోటళ్లకు వచ్చినప్పుడు కెమెరా ఉంటుందేమోనన్న భయం ఉంటుంది. ఇది కనుక్కోవడానికి గదిలోని అన్ని లైట్లను ఆపివేసి మీ మొబైల్ ఫోన్ కెమెరాతో చుట్టూ చూడండి. మీ ఫోన్ కెమెరాను నైట్ విజన్ లేదా ఇన్ఫ్రారెడ్ లైట్లు గుర్తించే విధంగా ఉపయోగించండి. కెమెరాను గదిలో ఎక్కడైనా తిప్పుతూ స్కాన్ చేయండి. హిడెన్ కెమెరాలు ఇన్ఫ్రారెడ్ లైట్స్‌ను విడుదల చేస్తాయి. ఇవి కెమెరా ద్వారా చిన్న రౌండ్ పాయింట్స్ లాగా కనిపిస్తాయి. ఎక్కడైనా ఎర్రటి లైట్ కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించండి. అది సీక్రెట్ కెమెరా అయి ఉంటుంది.
ఎలక్ట్రానిక్ పరికరాలు, బాత్రూమ్లను తనిఖీ చేయండి. లైట్లు, హీటర్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను జాగ్రత్తగా పరిశీలించండి.
హోటల్ రూమ్‌లోని మిర్రర్స్‌కు మీ ఉంగరాన్ని లేదా వేలిని టచ్ చేసి రిఫ్లెక్షన్‌ను పరిశీలించండి. అసలు మిర్రర్లో రిఫ్లెక్షన్ స్పేస్ ఉండాలి. కానీ హిడెన్ కెమెరా ఉన్న మిర్రర్లో రిఫ్లెక్షన్ చాలా తక్కువగా లేదా చుట్టుపక్కల కనిపిస్తుంది.
మీ ఫోన్లో వై-ఫై, బ్లూటూత్ సిగ్నల్స్‌ను చెక్ చేయండి. ఎటువంటి అనుమానాస్పద నెట్వర్క్ కనెక్ట్ అయ్యుంటే అది కెమెరా లేదా రికార్డింగ్ పరికరం అయి ఉండే అవకాశం ఉంది.
"హిడెన్ కెమెరా డిటెక్టర్," "గ్లోబల్ కెమెరా ఫైండర్" వంటి యాప్‌లను వాడండి. ఇవి గదిలోని ఎలక్ట్రానిక్ పరికరాలను, కెమెరాల సిగ్నల్స్‌ను గుర్తించడంలో సహాయం చేస్తాయి.
ఈ టెక్నిక్స్ ఉపయోగించి హోటల్స్ రూమ్స్ లో సురక్షితంగా ఉండండి.