Holi 2022: హోలీ పండుగ గురించి సైన్స్ ఏమంటోందో తెలుసా..?
Holi 2022: పురాణాల ప్రకారం.. రాధా కృష్ణుల అపార ప్రేమకు చిహ్నంగా, నరసింహ అవతారంలో శ్రీ మహా విష్ణువు హిరణ్యకశ్యపునిపై విజయం సాధించిన రోజుకు గుర్తుగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. మరి హోలీ పండుగ గురించి సైన్స్ ఏ చెబుతుందో తెలుసా..?
మన దేశంలో హోలీ పండుగకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారు. చిన్నా.. పెద్దా అంటూ ఎటువంటి భేదభావాలు చూపకుండా ప్రజలు ఈ హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు.
పురాణాల ప్రకారం.. రాధా కృష్ణుల ప్రేమకు చిహ్నంగా, నరసింహ అవతారంలో శ్రీ మహా విష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుని సంహరించిన రోజుకు గుర్తుగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు.
holi 2022
ఇక సైన్స్ ప్రకారం.. ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. కాగా హోలీ సందర్బంగా ఒక రోజు ముందు హోలిక దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెబుతోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటోంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది.
నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటంటే.. మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవికాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురవుతారు.అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వల్ల ఈ సోమరితం పోతుంది.
ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవడం, ధోల్ మంజీరా ఆడడం,స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పార్టీలు చేసుకోవడం వంటివి మనస్సు ఆనందాన్నిస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి.
holi 2022
హోలీ రంగులు..
హోలీ పండుగలో రంగులకు ప్రముఖ పాత్ర ఉంది. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రీయ రంగులు ఉపయోగించేవారు. మన తాతలు ముత్తాతలు అప్పట్లో హోలీ ఆడటానికి.. పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకు పచ్చ రంగు కోసం ఆకులను ఉపయోగించేవారు. అలాగే ఎండిన పువ్వులను, మోదుగ పువ్వులతో రంగులను తయారుచేసేవారు.
holi 2022
ఈ రంగులతో హోలీ ఆడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చల్లుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఆ రంగులను శరీరానికి పూయడం వల్ల చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియాలను, ట్యాన్ ను తొలగిపోతుంది.
ఆ రోజుల్లో పలాష్, మందార, గంధం, దానిమ్మ, కుంకుమ, గోరింట, బిల్వ ఆకులు, బంతి పువ్వు, అమల్టాస్, జకరండా, మోదుగ పువ్వులు వంటివి వాటితో హోలీ రంగులను తయారుచేసేవారు.
చెడుపై మంచి విజయం సాధించిన కథలు.. మనం కష్టాలను అధిగమించడానికి స్ఫూర్తిని నింపుతున్నాయి. హిరణ్యకశిపుడు అతని కొడు భక్త ప్రహ్లాదుడి కథ.. భక్తితో మనకు అంతా మంచే జరుగుతుందన్న పాఠాన్ని నేర్పుతుంది.
ఈ హోలీ పండుగ పౌరాణిక ప్రాముఖ్యతతో పాటు జీవిత పాఠాలను కూడా బోధిస్తుంది. ఇవి ప్రతికూలతలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. ఇక దీంతో పాటుగా కొత్త సీజన్‌కు లో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని కూడా అందిస్తుంది.