Health Tips: కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగితే క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..
Health Tips: శీతల పానీయాలు (cold drinks) మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావని చాలా మందికి తెలుసు. అయినా వీటిని తాగుతుంటారు. తాజా అధ్యయనం ప్రకారం.. కూల్ డ్రింక్స్ ను మోతాదుకు మించి తాగడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వస్తుంది.

వేసవి వచ్చిందంటే చాలు టీవీల్లో రకరకాల కూల్ డ్రింక్స్ (cold drinks)కు సంబంధించిన ప్రకటనలు విపరీతంగా వస్తుంటాయి. ఇక దుకాణాల్లో అయితే వివిధ కంపెనీలకు చెందిన సోడా కలిగిన పానీయాల బాక్సులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తాయి. ఇక మండుతున్న ఎండలో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కూల్ డ్రింక్ ను కొనుకుని తాగుతుంటారు. ఇది మీకు తాత్కాలికంగా రిఫ్రెష్ తో పాటు కడుపుకు చల్లదనాన్ని కలిగించినా.. ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందులోనూ యూత్ కూల్ డ్రింక్స్ ను మోతాదుకు మించి తాగడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కానీ ఇది ఎన్నో ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం పదండి.
శీతల పానీయాలు (cold drinks)కేలరీల మొత్తాన్ని పెంచుతాయని పరిశోధనలో తేలింది. ఇది అనేక రకాల శారీరక సమస్యలకు దారితీస్తుంది. ఇది బరువును పెంచడంతో పాటుగా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇది క్యాన్సర్ (Cancer)కు కూడా దారితీస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.. శీతల పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. 60,000 మందికి పైగా యువకులపై ఒక పరిశోధన చేశారు. వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తులు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic cancer) అభివృద్ధి చెందే అవకాశాలను 87 శాతం పెంచారు. అదే సమయంలో.. రుతుక్రమం (Menstruation) ఆగిపోయిన మహిళల్లో ఎక్కువ శీతల పానీయాలు తీసుకునే అలవాటు ఎండోమెట్రియల్ క్యాన్సర్ (Endometrial cancer) అంటే గర్భాశయ క్యాన్సర్ కు కారణమవుతుందని మరొక అధ్యయనం వెల్లడించింది.
డయాబెటిస్ బాధితుడు కావచ్చు.. కోల్డ్ డ్రింక్ లల్లో ఫ్రక్టోజ్ (Fructose) ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది టైప్ -2 డయాబెటిస్ కు దారితీస్తుంది. అంతే కాదు శీతల పానీయాలు తాగడం ద్వారా మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది. రోజూ ఒక బాటిల్ కూల్ డ్రింక్ తాగితే టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని అధ్యయనంలో తేలింది.
obesity
ఊబకాయం బాధితులు కావచ్చు.. one cane cold drink లో 8 టీ స్పూన్ల చక్కెర ఉంటుందని పరిశోధనలో తేలింది. దీని తీసుకోవడం వల్ల కేలరీల పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల మీరు ఊబకాయం బారిన పడవచ్చు.
కాలేయంలో సమస్యలు కలుగుతాయి.. కోల్డ్ డ్రింక్స్ కూడా కాలేయ సమస్యలను కలిగిస్తుంది. ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కాలేయంపై అదనపు భారం పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఇది కొవ్వు కాలేయంతో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది.