- Home
- Life
- Lemon Alternatives: కొండెక్కిన నిమ్మకాయలు.. దానికి బదులుగా వీటిని తీసుకోండి.. ఆరోగ్యంగా ఉంటారు..
Lemon Alternatives: కొండెక్కిన నిమ్మకాయలు.. దానికి బదులుగా వీటిని తీసుకోండి.. ఆరోగ్యంగా ఉంటారు..
Lemon Alternatives: సామాన్యుడు ఇప్పుడు నిమ్మకాయలను కొనలేడేమో.. ఇప్పుడు వీటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి సమయంలో నిమ్మకు ప్రత్యామ్నాయంగా ఏవి ఉంటే అవి తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

Lemon Alternatives: కొన్ని కొన్ని సీజన్లలో కొన్ని ఉత్పత్తుల ధరలు బగ్గ పెరిగిపోతుంటయ్.. ఇక ఈ సీజన్ లో నిమ్మకాయల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ఈ నిమ్మకాయల ధరలు సామాన్యుడిని వామ్మో అనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిన్న నిమ్మకాయ సైతం రూ.15 పలుకుతోంది. ధరలు ఇలా ఉండబట్టే సామాన్యులకు ఇది అందని ద్రాక్షలాగే మారింది.
అయితే ఈ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇప్పుడు సామాన్యులు నిమ్మకాయ తినే పరిస్థితి లేదు కాబట్టి.. వీటికి బదులుగా సి విటమిన్ అధికంగా ఉండే పుల్లని ప్రత్యామ్నాయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉసిరికాయలు.. ఉసిరికాయల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజుకు ఒక ఉసిరికాయ తిన్నారంటే చాలు మీ బాడీకి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. ఈ కాయలో విటమిన్ సి 600-700 మి.గ్రా ల వరకు ఉంటుంది. కాబట్టి నిమ్మకాయను కొనలేని వారు ఉసిరికాయలను తినండి.
పుల్ల మామిడి.. ఈ సీజన్ లో మామిడికాయలు కొదవే ఉండదు. వీటిలో బోలెడు విటమిన్ సి లభిస్తుంది. నిమ్మకాయ పులిహోరకు బదులుగా మామిడి తురుముతో పులిహోర చేసుకుని తినొచ్చు. ఇది భలే టేస్టీగా ఉంటుంది కూడా. నిమ్మకాయ పచ్చడి చేసుకుని తిన్నా.. మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది.
బొప్పాయి.. ఈ వేసవిలో బొప్పాయి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక వీటి ధరలు ప్రతి ఒక్కరూ కొనే విధంగానే ఉంటాయి. ఈ బొప్పాయి పండ్లు ఆడవారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి పీరియడ్స్ లో ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఈ పండులో పొటాషియం, సోడియం, ఫైబర్ ఫుష్కలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ సి కూడా ఉంటుంది.
నారింజలు.. నారింజలు నిమ్మజాతికి చెందిన సిట్రస్ ఫ్రూట్స్. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తాజా నారింజ పండ్లలో జ్యూస్ చేసుకుని తాగితే.. ఆ రుచి ఎంత బావుంటుందో .. ఈ జ్యూస్ పెద్దలకే కాదు పిల్లలకు కూడా చాలా మంచిది. ప్రస్తుతం నారింజ పండ్ల ధరలు తక్కువగానే ఉన్నాయి.
టొమాటోలు.. టొమాటోలు ఉండగా నిమ్మతో పనేముంది చెప్పండి. వీటిలో కూడా పులుపు గుణం ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉట్టిగానే తిన్నా లేదా.. కూరల్లో వేసుకుని తిన్నా మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది.
విటమిన్ సి స్ట్రాబెర్రీలు, జామకాయలు, క్యాప్సికంలో కూడా అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని కూడా మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవచ్చు. నిమ్మకాయ ధరలు కొండెక్కినయ్ కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా కొన్ని రోజులు వీటితో అడ్జస్ట్ అవ్వాల్సిందే మరి. వాస్తవానికి నిమ్మకాయ కంటే వీటిలోనే మరిన్ని పోషకాలు మనకు అందుతాయి తెలుసా.