గుండె జబ్బుల గురించి ఈ అపోహలను నమ్మకండి
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది గుండె జబ్బులతోనే చనిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ప్రాణాంతకమైన వ్యాధి గురించి ఎన్నో అపోహలు జనాలను మరింత బయపెడుతున్నాయి. అసలు గుండె జబ్బుల విషయంలో నమ్మకూడని విషయాలేంటో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోవడానికి గుండె జబ్బులే ప్రధాన కారణమన్న సంగతి మీకు తెలుసా? ఈ మధ్యకాలంలో భారతదేశంలో చిన్నవయసు వారు కూడా గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. టీవీలు, వార్తా పత్రికల్లో తరచుగా ఇలాంటి వార్తలను చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా గుండె జబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే గుండెజబ్బుల గురించి జనాలకు ఎన్నో విషయాలు తెలియదు. అపోహలనే వాస్తవాలంటే నమ్ముతుంటారు కొంతమంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు గుండె జబ్బుల గురించి అపోహలేంటి? వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
heart attack
అపోహ 1: గుండెపోటుకు ఏకైక సంకేతం నొప్పి
వాస్తవం: గుండెపోటు వస్తే ఛాతిలో నొప్పి కలగడం సాధారణ విషయం. అయితే గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరికీ.. ఛాతిలో నొప్పి కలగకపోవచ్చు. డయాబెటిస్ ఉన్న వృద్ధులకు గుండెపోటు వస్తే.. ఛాతీలో నొప్పి కలగకపోవచ్చుని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారికి ఛాతిలో నొప్పి కాకుండా శ్వాస ఆడకపోవడం లేదా చెమట ఎక్కువగా పట్టడం లాంటి సంకేతాలు కనిపించొచ్చు. కొన్ని కొన్ని సార్లు చాలా మంది గుండెపోటుకు సంకేతంగా మెడ లేదా భుజం లేదా ముంజేయిలో నొప్పిని అనుభవిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీళ్లకు ఛాతీలో అసౌకర్యంగా కూడా ఉంటుంది.
heart attack
అపోహ 2: బైపాస్ కంటే యాంజియోప్లాస్టీ మంచిది
వాస్తవం: యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ రోగులకు రీవాస్కులరైజేషన్ కు రెండు వేర్వేరు పద్ధతులు. ఈ రెండు పద్దతులు ధమనుల గుండా గుండెకు రక్తం, ఆక్సిజన్ బాగా వెళ్లేందుకు సహాయపడతాయి. వీటివల్ల ఎన్ని ఉపయోగాలుంటాయో.. నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
heart attack
అపోహ 3: మా కుటుంబంలో గుండె జబ్బులున్న వారున్నారు. నా గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే ఏం చేయాలి?
వాస్తవం: నిజానికి మీ కుటుంబంలో హార్ట్ పేషెంట్లు ఉన్నా.. మీరు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. జన్యుపరమైన వారసత్వంతో పాటుగా డయాబెటీస్, అధిక రక్తపోటు, మీరు తినే ఆహారం, స్మోకింగ్ , ఒత్తిడితో కూడిన జీవనశైలి వంటివి మీ గుండెను ప్రమాదంలో నెట్టేయొచ్చు. అయితే మీ జీవన శైలి ఆరోగ్యంగా ఉంటే మీకు గుండె జబ్బులు ఆలస్యంగా రావొచ్చంటున్నారు నిపుణులు. లేదా మొత్తమే రాకపోవచ్చు.
అపోహ 4: హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవడమేనా
వాస్తవం: హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండె పంపింగ్ తగ్గిందనడానికి ఉపయోగించే పదం. ఈ రోజుల్లో గుండె వైఫల్యానికి చికిత్స చేయడానికి, గుండె మునపటిలా కొట్టుకోవడానికి మందులు, పరికరాలు ఉన్నాయి. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
heart attack
అపోహ 5: నేను మందులు తీసుకున్నంత కాలం డయాబెటిస్ నా గుండెను ప్రభావితం చేయలేదు
వాస్తవం: డయాబెటిస్ లేదా హైపర్ టెన్షన్ రోగులు మందులను ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా హెచ్ బిఎ 1 సి 7 కంటే తక్కువ, రక్తపోటు 140/90 ఉన్నవాళ్లు. వీటివల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. అందుకే వీళ్లు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ఈ రోగులు తరచుగా తమ డాక్టర్ ను సంప్రదిస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.