పండ్లు ఏ సమయంలో తింటే మంచిది?
పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనివల్ల వాటి ప్రయోజనాలను పొందకపోవడమే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

fruits
పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు. పండ్లను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. క్యాన్సర్ ను కలిగించే కణాల నుంచి రక్షణను కలిగిస్తాయి. ఇదంతా బానే ఉన్నా పండ్లను ఏ సమయంలో తినాలో చాలా మందికి అస్సలు తెలియదు. అసలు పండ్లను ఏ సమయంలో తింటే మందిది.. ఏ సమయంలో తింటే మంచిది కాదన్న ముచ్చటను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టైం కానీ టైంలో కొన్ని పండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు రావొచ్చు. ప్రతి పండులో వివిధ రకాల ఎంజైమ్లు, ఆమ్లాలు ఉంటాయి.ఇవి గట్లోని బ్యాక్టీరియాతో ప్రతిస్పందించగలవు. ఇవి ఆ వ్యక్తి లక్షణాలను బట్టి మంచి లేదా చెడును చేయొచ్చు.
fruits
పండ్లను తినడానికి ఉత్తమ సమయం ఉదయం అని చాలా మంది చెప్తుంటారు. ఖాళీ కడుపున పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని, బరువు నియంత్రిణలో ఉంటుందని, శరీర వ్యవస్థలను నిర్విషీకరణ చేస్తుందని, కొన్ని ఊబకాయ సంబంధిత వ్యాధులను నివారిస్తుందని చాలా మంది చెప్తుంటారు. మరికొందరు పండ్లను తినడానికి మధ్యాహ్నం ఉత్తమ సమయం అని చెబుతుంటారు. ఏదేమైనా ఈ సూచనలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధ్యాహ్నం లేదా ఉదయం పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీ జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుంది.
fruits
ఉదయం పరగడుపున పండ్లను తింటే మన కడుపు శుభ్రపడుతుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది. అందుకే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను పరిగడుపున తినాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే తినడానికి ఉత్తమమైన పండ్లలో పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, దానిమ్మ, అరటిపండ్లు ఉన్నాయి.
చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రకరకాల పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉదయాన్నే పండ్లను తింటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతారు. మీరు బ్రేక్ ఫాస్ట్ లో పండ్లను తినడానికి ఇష్టపడితే ఏ పండ్లను పడితే ఆ పండ్లను అస్సలు తినకూడదు. పైనాపిల్, చెర్రీ, కివి, స్ట్రాబెర్రీ, ఆపిల్ పండ్లను ఉదయం పూట తినొచ్చు. వీటివల్ల ఎలాంటి సమస్యలు రావు. పైనాపిల్, చెర్రీ పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. కివి, స్ట్రాబెర్రీలు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఉదయాన్నే ఒక ఆపిల్ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
రాత్రిపూట పండ్లను తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందని కొంతమంది అంటుంటారు. అయితే నిద్రపోవడానికి ముందు పండ్లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే నిద్రపోవడానికి కొన్ని గంటల ముందే పండ్లను తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే హాయిగా నిద్రపడుతుంది. పైనాపిల్స్, అవోకాడోలు, కివి వంటివి రాత్రిపూట తినే పండ్లు.